Viral Video: గేదెపై బుడ్డోడి ఫీట్స్.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సేహ్వాగ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Viral Video: పల్లెటూరు వాతావరణాన్ని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. ఇప్పుడంటే.. పట్టణాలు అభివృద్ధి చెంది ఉపాధి కోసం అందరూ పట్టణాలకు వలసలు వెళ్తున్నారు గానీ..
Viral Video: పల్లెటూరు వాతావరణాన్ని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. ఇప్పుడంటే.. పట్టణాలు అభివృద్ధి చెంది ఉపాధి కోసం అందరూ పట్టణాలకు వలసలు వెళ్తున్నారు గానీ.. కొన్నేళ్ల క్రితం అందరూ పల్లెల్లోనే జీవనం సాగించేవారు. పల్లేలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడి జీవన విధానం ఎప్పటికీ మధురమే. అందుకే పల్లె నుంచి పట్టణాలకు తరలివెళ్లిన ప్రజలు తమ సొంత ఊరిని తలుచుకోకుండా ఉండలేరు. బాల్యం నాటి మధుర జ్ఞాపకాలను, ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటూనే ఉంటారు.
ఇదిలాఉంటే.. ట్రెండింగ్ వీడియోలకు సోషల్‌మీడియా అడ్డగా మారిపోయింది. ప్రపంచ నలుమూలల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా.. ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన వీడియో.. నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.
ఇంతకీ సేహ్వాగ్ షేర్ చేసిన వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ గేదెపైకి ఎక్కిన పిల్లాడు వాటర్ పైప్‌తో జలకాలాడుతున్నాడు. వాటర్ పైపుతో తనపై నీళ్లు పోసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో బ్యాక్‌డ్రాప్‌లో ఓ బాలీవుడ్ పాటను యడ్ చేశారు. ఆ పాటకు, ఆ బుడ్డోడి డ్యాన్స్ సింక్ అవడంతో.. ఆ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్‌లో పేలుతుంది. గేదెపై పడుకుని, కూర్చుని స్నానం చేస్తూ ఆ బాలుడు చేసిన ఫీట్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ వీడియో షేర్ చేసిన సేహ్వాగ్.. గ్రామాల్లో జీవితం ఇలా సరదాగా గడిచిపోతుంటుందని, నగరాల్లో ఉన్నవారికి ఇటువంటి సరదాల గురించి తెలియదని క్యాప్షన్ పెట్టాడు.
Video:
View this post on Instagram
Also read:
Shocking Video: నది మధ్యలోని తేలుతున్న శరీరం.. తీరా దగ్గరికెళితే.. ఊహించని షాక్..!