Viral Video: దేశానికి రైతు వెన్నుముక లాంటివాడు. రైతు పండించే పంటతో ప్రజలు కడుపు నింపుకొంటున్నారు. వ్యవసాయం అనేది తేలికైన పని కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే వ్యవసాయ (Agriculture) రంగంలో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు వచ్చాయి. వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రకరకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలు చాలా ఖరీదైనవి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. రైతు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. రైతు తన పొలంలో కలుపు మొక్కలను ఏరివేసేందుకు, దున్నేందుకు తన బైక్‌ను ఉపయోగించాడు. బైక్‌కు నాగలి లాంటి ఇనుప పరికరాన్ని అమర్చి కలుపు మొక్కలను ఏరివేసేందుకు దున్నేస్తున్నాడు. ఈ వీడియోను techzexpress అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పోస్టు చేయబడింది. తన బైక్‌పై దున్నడానికి, కలుపు మొక్కలను తొలగించడానికి నాగలి యంత్రాన్ని అమర్చడంపై నెటిజన్లు ఈ రైతును ప్రశంసిస్తు్న్నారు.
ఇలా బైక్ ద్వారా దున్నడం వల్ల ఖర్చు కూడా ఎంతో తగ్గుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. అలాగే వేలాదిగా లైక్స్ వస్తున్నాయి. ఈ రైతును అభినందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి