సింహాం.. అడవికి రాజు.. దీనిని మృగరాజు అని కూడా అంటారు.. అలాంటి మృగరాజుకు ఎదురుగా వెళ్లే సాహసం ఎవరూ చేయరు. అడవిలోని జంతువైనా, మనిషైనా సరే.. సింహం నీడను కూడా తాకాలని ప్రయత్నించరు.. అలా చేస్తే..ఇక తమకు ముడినట్టేనని తెలుసు.. అలాంటి సింహాన్ని దూరం నుండి చూడాలంటేనే భయపడతారు చాలామంది. కానీ, ఇక్కడ యువకుడు మాత్రం సింహంతో ఎకసెకలకు పోయాడు.. దాంతో ఆ సింహం అతని తిక్క కుదిర్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే భయపడిపోతారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జమైకాలోని ఓ జూకీపర్ సింహం నోటి దగ్గర వేలు పెట్టి దానిని రెచ్చగొట్టాడు. ఒక్కసారిగా సింహం అతడి వేల్లను నోట్లో పెట్టుకుంది. అతడు ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అతడు తన ఉంగరం వేలును కోల్పోయాడు. జూకు వచ్చిన సందర్శకులు ఇదంతా జోక్ అనుకొని వీడియో తీస్తూ ఉండిపోయారు. రెండేళ్ల క్రింద జరిగిన ఈ సంఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూడండి..
సందర్శకుల కెమెరాలకు ఈ దృశ్యాలు చిక్కాయి. కాగా.. చుట్టుపక్కల అంత మంది ఉండగా.. ఒక్కరు కూడా అతడిని రక్షించేందుకు ప్రయత్నించలేదు. అయితే, ఈ వీడియో పాతది అంటున్నారు చాలా మంది నెటిజన్లు. కానీ, వీడియో మాత్రం తాజాగా మారోమారు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కామెంట్లను కూడా సంపాదిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..