Viral Video: జూలో కోతి ముందు ఓ వ్యక్తి మ్యాజిక్.. కోతి రియాక్షన్ వీడియో నెట్టింట్లో వైరల్..

Viral Video: కోతికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ వీడియోల్లో కోతి(Monkey) చేసే చేష్టలు నెటిజన్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. తాజాగా జూ లో కోతి పిల్ల ..

Viral Video: జూలో కోతి ముందు ఓ వ్యక్తి మ్యాజిక్..  కోతి రియాక్షన్ వీడియో నెట్టింట్లో వైరల్..
Monkey Viral Video

Updated on: Feb 04, 2022 | 11:15 PM

Viral Video: కోతికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ వీడియోల్లో కోతి(Monkey) చేసే చేష్టలు నెటిజన్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. తాజాగా జూ లో కోతి పిల్ల .. మ్యాజిక్ వీడియో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి కోతికి మ్యాజిక్ చూపించగా కోతి రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో షేర్ చేశారు. అక్కడ దీనికి 1.6 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ వీడియో మెక్సికో నగరంలోని చాపుల్టెపెక్ జూలో రికార్డ్ చేయబడింది.

వీడియోలో.. మెక్సికన్ జంతుప్రదర్శనశాలలో మాక్సిమిలియానో ​​ఇబార్రా అనే ఒక సందర్శకుడు ఒక పెద్ద గాజు కిటికీ ద్వారా ఒక ఆవరణలో ఉన్న ఒక కోతిని చూపిస్తున్నాడు. ఇబార్రా ఇలా తనని చూపించే విధానం కోతి అవ్వాక్కయ్యేలా చేసింది. అంతేకాదుఆ మ్యాజిక్ ట్రిక్ చూసి కోతి షాక్ అయింది. పిచ్చిపిచ్చిగా

ప్ర‌వ‌ర్తించింది. కోతి ఎక్స్ప్రెషన్స్ చూసీ ఇబార్రా ఆశ్చర్యపోయాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ముందు టిక్‌టాక్‌లో పోస్ట్ చేయ‌గా నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి తెగ న‌వ్వుకున్నారు.

Also Read:

ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా.. అయితే పూజ గదిలో ఈ వస్తువులు పెట్టుకోండి..