
మంచి విలువలు అనేవి మాటల్లో చెబితే వచ్చేవి కావు, అవి మన ప్రవర్తనలో కనిపిస్తాయని ఒక చిన్నారి నిరూపించాడు. సాధారణంగా మెట్రో వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా వస్తువు కింద పడినా లేదా జారిపోయినా చాలామంది చూసీచూడనట్లు వెళ్లిపోతారు. కానీ ఈ బుజ్జాయి మాత్రం పెద్దలకు సైతం ఆదర్శంగా నిలిచి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న బాలుడు మెట్రోలో ప్రయాణిస్తున్నాడు. అయితే అనుకోకుండా అతని చేతిలోని కూల్ డ్రింక్ బాటిల్ కింద పడిపోయింది. దీంతో డ్రింక్ కింద పడి అంతా తడిగా మారింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఏ పిల్లవాడైనా భయపడటం లేదా ఏడవడం చేస్తాడు. కానీ ఈ బాబు అలా చేయలేదు.
డ్రింక్ కింద పడగానే ఏమాత్రం తడబడకుండా, ఆ అబ్బాయి తన బ్యాగ్ నుంచి ఒక టిష్యూ పేపర్‌ను బయటకు తీశాడు. వెంటనే నేలపై వంగి, తాను పారబోసిన డ్రింక్‌ను స్వయంగా తుడిచాడు. మెట్రోలో ఉన్న ఇతర ప్రయాణికులు ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ చిన్న వయసులోనే ఇంత బాధ్యతగా వ్యవహరించడం చూసి వారు మురిసిపోయారు. దీనిని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.
ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “సంస్కారం అంటే ఇదే.. తల్లిదండ్రుల పెంపకం ఆ బాబు ప్రవర్తనలో కనిపిస్తోంది” అని ఒకరు కామెంట్ చేయగా.. బాధ్యత అనేది వయసుతో సంబంధం లేనిదని ఈ అబ్బాయి నిరూపించాడు అంటూ అని మరొకరు రాసుకొచ్చారు. ఈ సంఘటన ఏ నగరంలో జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ పిల్లాడి విలువలు మాత్రం దేశ సరిహద్దులు దాటి అందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాయి.
चीन की मेट्रो में एक छोटा सा बच्चा गलती से Cold drink गिरा देता है।
फिर चुपचाप बैग से टिशू निकालता है,और खुद ही साफ कर देता है।
कोई डांट नहीं, कोई बहाना नहीं बस जिम्मेदारी का सुंदर एहसास।
ये है असली परवरिश की ताकत। ऐसे बच्चे बड़े होकर दुनिया को और बेहतर बनाएंगे। pic.twitter.com/14SWOmOkxy— TANVEER (@mdtanveer87) December 18, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.