AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీ ఆత్రం తగలెయ్య.. రోడ్డు మీద ఇదేం పనిరయ్యా… ఓ రేంజ్‌లో కోటింగ్‌ ఇచ్చిన ఖాకీలు

ఈ మధ్య కాలంలో యువత విచ్చలవిడితనం పెరిగిపోయింది. సమాజంలో చుట్టూ ఏం జరుగుతోంది.. ఎవరు ఉన్నారనేది కూడా చూసుకోకుండా హద్దులు మీరుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ కోసం పబ్లిక్‌గానే రోమాన్స్‌కు వెనకాడటం...

Viral Video: మీ ఆత్రం తగలెయ్య.. రోడ్డు మీద ఇదేం పనిరయ్యా... ఓ రేంజ్‌లో కోటింగ్‌ ఇచ్చిన ఖాకీలు
Lovers Romance On Running B
K Sammaiah
|

Updated on: Jun 17, 2025 | 5:12 PM

Share

ఈ మధ్య కాలంలో యువత విచ్చలవిడితనం పెరిగిపోయింది. సమాజంలో చుట్టూ ఏం జరుగుతోంది.. ఎవరు ఉన్నారనేది కూడా చూసుకోకుండా హద్దులు మీరుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ కోసం పబ్లిక్‌గానే రోమాన్స్‌కు వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేక వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతునే ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోలోని దృశ్యాలను బట్టి ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ జంట బైక్‌పై వెళ్తూ అత్యంత ప్రమాదకరంగా రొమాన్స్‌లో మునిగి తేలారు. యువకుడు బైక్‌ నడుపుతుండగా.. యువతి ముందు పెట్రోల్‌ ట్యాంక్‌పై కూర్చొని అతడిని కౌగిలించుకుంది. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

వీడియో్ కాస్తా వైర‌ల్‌గా మారడంతో పోలీసుల కంట పడింది. నోయిడా ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెహిలక్‌ నెంబర్‌తో ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు, తోటి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసినందుకు చర్యలు తీసుకున్నారు. రూ.53,500 భారీ జరిమానా విధించారు. బైక్‌ను సీజ్‌ కూడా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వీడియో చూడండి:

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..