Shocking Video: ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో తేళ్లు, పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని తేమకు తోడు నిల్వ నీటి కారణంగా విషపు పురుగులు ఇంట్లోకి వస్తుంటాయి. అందుకే ఈ వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పాముల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో ఒక తల్లి తన కుమారుడిని పెద్ద నాగుపాము బారి నుంచి చాకచక్యంగా కాపాడింది. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఇందులో ఒక తల్లి తన కుమారుడిని పాఠశాలకు పంపేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుంది. అయితే అప్పటికే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము పాకుతూ వెళుతూ ఉంటుంది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేశాడు. దీంతో ఆ పాము వెంటనే వెనక్కి వెళ్లింది. బుసలు కొడుతూ పెద్ద ఎత్తున పైకిలేచింది. అదే సమయంలో ఊడిన బూటు కోసం దగ్గరకు వస్తున్న బాలుడిని కాటేయబోయింది. దీన్ని గమనించిన తల్లి వెంటనే స్పందిస్తుంది. పాము నుంచి కుమారుడిని వెంటనే పక్కకు లాగుతుంది. బాలుడిని ఎత్తుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుతంది. దీంతో ఆ పాము తాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కాగా ఈ సంఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అదే సమయంలో క్షణాల్లో స్పందించి నాగుపాము బారి నుంచి కుమారుడిని కాపాడిన తల్లి తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..