మనిషి ఎలా జీవించాలో పరిస్థితులే నేర్పుతాయని అంటారు. ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న వ్యక్తులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. మరోవైపు చంద్రుడిని తాకుతున్నా, సముద్రం లోతులు కొలుస్తున్నా ఇప్పటికీ ఎక్కువ మంది మనుషులు తమ జీవితాలను కనీస అవకాశాలు తీరకుండానే గడుపుతున్నారు. కొన్నిసార్లు 70-80 సంవత్సరాల వయస్సులో కూడా పని చేయవలసి ఉంటుంది. కొంతమంది జీవితాల్లో తమను, తమ కుటుంబాలను పోషించుకోవల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వృద్ధుడి కఠినమైన జీవన పోరాటం కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన తర్వాత ఎవరి కనులు అయినా చేమర్చకుండా ఉండవు.
ఒక వృద్ధ రిక్షా పుల్లర్ చిరునవ్వుతో నిలబడి ఉండటం.. అతనితో మాట్లాడటానికి ఒక మహిళ ప్రయత్నిస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఆ మహిళ వాస్తవానికి వృద్ధుడి రిక్షాపై కూర్చుని ఉంది. ఈ వయస్సులో కూడా అతడు పడుతున్న కష్టాన్ని చూసి.. ఆమె అతనిపై జాలిపడి, ఆ తర్వాత అతనికి డబ్బు సహాయం చేయడానికి ప్రయత్నించింది. ముందుగా ఆ వృద్ధుడిని ఆ మహిళ ఛార్జీ ఎంత అని అడగ్గా.. ఆ వృద్ధుడు ఆ యువతితో రూ.100 అని చెప్పింది. అప్పుడు ఆమె రూ.500 నోటు ఇచ్చింది. అంతేకాదు ఆమె తన సోదరుడు, భర్త పేరిట మరో రెండు 500 రూపాయల నోట్లను ఇచ్చింది.
किस उम्र तक पैसा कमाना है ये उम्र नहीं परिस्थितियाँ तय करती है,🥺 pic.twitter.com/3gKA90bflA
— Abhay Raj (@AbhayRaj_017) May 27, 2024
ఆ మహిళ ఔదార్యాన్ని చూసి నెటిజన్ల హృదయం ద్రవించింది. అంతేకాదు వృద్ధ రిక్షా కార్మికుడి జీవన పోరాటాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. హృదయాన్ని హత్తుకునే వీడియో @AbhayRaj_017 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎవరు డబ్బు సంపాదించాలనేది వయస్సు కాదు, పరిస్థితులే నిర్ణయిస్తాయి అని చదవబడింది.
ఒక్క నిమిషం నిడివిగల ఈ వీడియో ఇప్పటికే కొన్ని వేల వ్యూస్ ను సొంతం చేసుకుంది.. ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఒకరు ‘ఇది చాలా విచారకరమైన పరిస్థితి’ అని రాస్తే, మరొకరు పరిస్థితులు మనిషి జీవితాన్ని బలవంతంగా పని చేయిస్తుంది అని వ్రాశారు. అదేవిధంగా మరొకరు ‘పరిస్థితులపై ఎవరికీ నియంత్రణ లేదు’ అని కామెంట్ చేయగా ‘పేదరికంలో వయస్సు పరిగణించబడదు.. డబ్బు లేకపోతే జీవితం లేదు అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..