Viral Video: రెండు పాములను రెండు చేతులతో పట్టుకున్న యువతి.. ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..

|

Aug 06, 2023 | 2:46 PM

వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ చేసిన సాహసం చూస్తే ఎవరైనా సరే అదిరిపడతారు. పెరట్లో చొరబడిన రెండు పెద్ద పెద్ద పాములను రెండు చేతులతో ఇట్టే పట్టేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మో ఆమెకు ఎంత ధైర్యం? హ్యాట్సాఫ్ అంటున్నారు.

Viral Video: రెండు పాములను రెండు చేతులతో పట్టుకున్న యువతి.. ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..
Viral Video
Follow us on

పాము పేరు చెబితే అది ఏ రకం పాము అని కూడా ఆలోచించకుండా భయంతో వెంటనే అక్కడ నుంచి వీలైనంత దూరం పరుగులంకించుకుంటారు. అయితే ఎటువంటి పాములనైనా సరే తమకు లెక్కలేదంటూ వాటిని ఒట్టి చేతితో పట్టుకుంటారు. వాటిని వీలయితే సురక్షిత ప్రాంతాల్లో వదలడమో.. లేదంటే చంపడమో చేస్తారు. పాములను చాకచక్యంగా పట్టుకుంటున్న బుడతలు, యువకులు వంటి వ్యక్తుల గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ చేసిన సాహసం చూస్తే ఎవరైనా సరే అదిరిపడతారు. పెరట్లో చొరబడిన రెండు పెద్ద పెద్ద పాములను రెండు చేతులతో ఇట్టే పట్టేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మో ఆమెకు ఎంత ధైర్యం? హ్యాట్సాఫ్ అంటున్నారు.

ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలియదు కానీ.. చూస్తుంటే ఓ విద్యా కేంద్రంలో ఇది జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ ఓ చిన్న డ్రైన్‌ లాంటిది వుంది. దాని పక్కన రెండు పెద్ద పాములు మెలికవేసుకుని కలిసి ఉన్నాయి. అటుగా వచ్చిన ఓ మహిళ వాటిని చూసింది. వెంటనే రెండు చేతులతో రెండింటినీ పట్టేసుకుంది. ఒకటి తప్పించుకుని పారిపోతున్నా వదల్లేదు. దాన్నికూడా పట్టుకుంది. అనంతరం వాటిని అదుపు చేయడానికి ఆ యువతి ప్రయత్నం చేసింది. సాధారణంగా నాగుపాము అయితే ఎంతో చురుగ్గా ఉంటుంది. అందునా తన తోక పట్టుకుంటే.. రెప్ప పాటులో బుస్ అంటూ పడగవిప్పి కాటు వేస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో వైరల్

 

అయితే యువతి పట్టుకున్న పాములు మాత్రం.. ఆ యువతి చేతుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందునా తమ తోక భాగాన పట్టున్న నోటితో కాటేసే అవకాశం ఉన్నా అటువంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఆ పాములు విషపూరితమైనవి కానట్టుంది. ఎందుకంటే అవి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయే కానీ, ఎదురుదాడికి దిగలేదు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కొందరు అభినందిస్తుంటే, కొందరు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు యూజర్లు అయితే ఆ పాములు ఎవరూ లేని చోట ఉన్నాయి.. అసలు వాటి జోలికి వెళ్లడం.. ఎందుకు అసౌకర్యం కలిగించడం? అంటూ ఆ యువతి చర్యను నిరసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..