
వేసవిలో శరీరం హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగడంతో పాటు ఇతర రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా వేసవిలో చౌకగా మరియు విరివిగా లభించే పుచ్చకాయని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. పుచ్చకాయ ఎండవేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. పుచ్చకాయను క్రమ పద్దతిలో కట్ చేసి తింటారు. కొంతమంది పుచ్చకాయ ముక్కలపై మసాల వేసుకుని తినడానికి ఇష్టపడుతుంటారు.
అయితే పుచ్చకాయను అందరి మాదిరిగా కాకుండా వెరైటీగా తిని చూపించాడు ఓ పుచ్చకాయ ప్రియుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది రీల్‌కోసమే చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ కావడానికి విచిత్రమైన ఆలోచనలను రీల్స్‌గా చేస్తూ అప్‌లోడ్ చేస్తున్నారు. అలా చేసిందే ఈ వీడియో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్‌లో, పుచ్చకాయ ముక్కలను ఒక ప్లేట్ నుండి తీసుకుని వివిధ వంటల్లో మిక్స్ చేసి ఆరగిస్తాడు. అసలు పుచ్చకాయకు ఎలాంటి సంబంధం లేని వంటకాలతో పుచ్చకాయను కలిపి తినడం ఆసక్తిగా మారింది. ఒక కప్పు చాయ్‌లో పుచ్చకాయ ముక్కను ముంచడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పుచ్చకాయ పిజ్జాపైకి, ‘మసాలా’ దోస లోపలకి వెళుతుంది.
వీడియో చూడండి:
వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. “పుచ్చకాయతో భుజియా నిజానికి చెడ్డ ఆలోచన కాదు, కర్కే దేఖ్తా హూన్ (నేను ప్రయత్నించి చూస్తాను) అని ఒక వినియోగదారు పోస్టు పెట్టారు. “పిజ్జాపై పైనాపిల్ సే తో అచా హి లగేగా యే (ఇది నిజానికి పిజ్జాపై పైనాపిల్ కంటే రుచిగా ఉండవచ్చు)”, అని మరొకరు కామెంట్స్ రాశారు. “ప్యూర్ చాయ్ కా మజా కిర్కిరా కర్ దియా (నీవు టీ ఆనందాన్ని పూర్తిగా నాశనం చేశావు)” అని ఒక టీ ప్రియుడు కోపంగా వ్యక్తం చేశాడు.