
కారు ప్రమాదాలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయంకరంగానూ, మరికొన్ని యాక్సిడెంట్ అయినప్పటికీ ఫన్నీగా ఉంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. టైర్ పేలిన తర్వాత వ్యాగన్ఆర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. కొత్త సంవత్సరం మొదటి రోజే కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది . ఇక్కడ, ఒక వ్యాగన్ఆర్ కారు రోడ్డుపై వెళుతుండగా అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నేరుగా ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. ఈ భయానక ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు దిగ్భ్రాంతి చెందుతున్నారు.
వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఈ సంఘటన జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 3:51 గంటల ప్రాంతంలో మంగళూరులోని మరకాడ ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. కారు నిరుడే నుండి బోండెల్ వరకు సాధారణ వేగంతో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా టైరు పేలింది. ఆ తర్వాత జరిగినది ఒక సినిమాలోని సన్నివేశంలా కారు అమాంతం ఆ పక్కనే ఉన్న ఇంటిలోకి జంప్ చేసింది.
టైరు పగిలిన వెంటనే, వ్యాగన్ఆర్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ భయానక దృశ్యంలో కారు ఒక వైపుకు ఒరిగి బోల్తా పడటం కనిపిస్తుంది. దానికి ముందు, కారు గాలిలో ఊగుతూ పడిపోవడం చూడవచ్చు.
ఈ ఘోర ప్రమాదాన్ని చూసి, కారులో ఉన్న ఎవరూ ప్రాణాలతో బయటపడతారని ఎవరూ నమ్మలేదు. కానీ కారులో ఉన్న వారందరూ అద్భుతంగా సురక్షితంగా బయటపడటం అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పేలుడు శబ్దం విన్న సమీపంలోని ప్రజలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు బోల్తా పడిన కారును సరిచేసి, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
#Mangaluru, Marakada 🚨⚠️
WagonR driver lost control after tyre burst as per news, which tyre? @DriveSmart_IN @RSGuy_India pic.twitter.com/jOPLU7IKhc
— Dave (Road Safety: City & Highways) (@motordave2) January 3, 2026