Viral Video: గాల్లోకి అమాంతం ఎగిరి నదిలో పడ్డ ట్రక్కు… నెట్టింట భయానక వీడియో వైరల్‌

మసాచుసెట్స్‌లోని మార్ష్‌ఫీల్డ్‌లో ఒక నాటకీయ సంఘటన జరిగింది. ఒక టీనేజర్ డ్రైవర్ పికప్ ట్రక్కును డాక్ నుండి వెనక్కి తీస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి 15 అడుగుల లోతున నదిలో పడిపోయింది. ఆదివారం ఉదయం గ్రీన్ హార్బర్ టౌన్ పీర్ వద్ద ఈ సంఘటన జరిగిందని...

Viral Video: గాల్లోకి అమాంతం ఎగిరి నదిలో పడ్డ ట్రక్కు... నెట్టింట భయానక వీడియో వైరల్‌
Truck Fell In The River

Updated on: Aug 29, 2025 | 6:00 PM

మసాచుసెట్స్‌లోని మార్ష్‌ఫీల్డ్‌లో ఒక నాటకీయ సంఘటన జరిగింది. ఒక టీనేజర్ డ్రైవర్ పికప్ ట్రక్కును డాక్ నుండి వెనక్కి తీస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి 15 అడుగుల లోతున నదిలో పడిపోయింది. ఆదివారం ఉదయం గ్రీన్ హార్బర్ టౌన్ పీర్ వద్ద ఈ సంఘటన జరిగిందని మార్ష్‌ఫీల్డ్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని CCTV కెమెరాలో రికార్డ్‌ అయింది. దీంతో ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

అదృష్టవశాత్తూ ప్రమాదం సమయంలో నదిలో ఉన్న ఒక పడవ తృటిలో తప్పించుకుంది. ఆ పడవ కూడా టీనేజ్‌ డ్రైవర్‌ తండ్రిదేనని చెబుతున్నారు. ఆ టీనేజర్ డ్రైవర్ ట్రక్కు వెనుక విండో నుంచి దూకి ఈదుకుంటూ రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తరువాత ట్రక్కును నది నుండి బయటకు తీశారు. బయటకు తీసే సమయంలో అది డ్యామేజ్‌ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

వీడియో చూడండి:

ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, ట్రక్కు నదిలో ఉన్న పడవలోకి దాదాపుగా దూసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక పోలీసులు చెప్పారు. అదృష్టవశాత్తూ ట్రక్కు పడిపోయిన చోట ఎవరూ లేరు. పడవలో ఉన్న యువకుడి తండ్రికి ఎటువంటి గాయం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్స్‌ రకరకాలుగా కామెంట్స్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.