Traffic Jam: ఇదిగో ఇది విన్నారా.. ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. షాకింగ్ వీడియో వైరల్..

|

May 25, 2024 | 8:30 PM

కొన్నేళ్ల క్రితం వరకు ఎవరెస్ట్ శిఖరాన్ని అతికొద్ది మంది మాత్రమే అధిరోహించేవారు. అయితే ఇప్పుడు ఈ సంఖ్య చాలా వరకు పెరిగింది. అది ఎంతగా పెరిగిపోయిందంటే ఎవరెస్ట్ శిఖరంపై 'ట్రాఫిక్ జామ్' ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఎంతమంది కలిసి చేరుకున్నారో వీడియోలో చూడవచ్చు.

Traffic Jam: ఇదిగో ఇది విన్నారా.. ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. షాకింగ్ వీడియో వైరల్..
Traffic Jam In Mount Everest
Follow us on

కాలంతో వచ్చిన అభిరుచుల్లో వచ్చిన మార్పుల్లో భాగంగా సాహస క్రీడలను ఇష్టపడేవారు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నారు. అలాంటి సహసాల్లో ఒకటి పర్వత శిఖర అధిరోహణ. ఒకానొక సమయంలో పర్వతాలు ఎక్కేటప్పుడు పడిపోతే ఏమవుతుందో అని ఆలోచించేవారు. అయితే ఇప్పుడు అనేక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ప్రజల్లో ఈ భయం క్రమంగా తగ్గుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా పిలవడుతున్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ముందడుగు వేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఎవరెస్ట్ శిఖరాన్ని అతికొద్ది మంది మాత్రమే అధిరోహించేవారు. అయితే ఇప్పుడు ఈ సంఖ్య చాలా వరకు పెరిగింది. అది ఎంతగా పెరిగిపోయిందంటే ఎవరెస్ట్ శిఖరంపై ‘ట్రాఫిక్ జామ్’ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఎంతమంది కలిసి చేరుకున్నారో వీడియోలో చూడవచ్చు. పర్వత కొండమీద చాలా పొడవైన క్యూ ఉంది. వారిలో కొందరు శిఖరం నుంచి చుట్టుపక్కల దృశ్యాలను చూసి తిరిగి వస్తున్నారు. మరికొందరు శిఖరానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు జనం పర్యటన ముగిసే వరకు వేచి ఉన్నారు. వారి వంతు కూడా వస్తుంది. ఇలాంటి దృశ్యాన్ని ఎవరైనా సరే చాలా అరుదుగా చూసి ఉంటారు. ఎవరెస్ట్‌ను అధిరోహించడం అనేది పిల్లల ఆట కానప్పటికీ.. రోజు రోజుకీ అధిరోహకుల్లో ఒక అభిరుచిగా మారిపోతుంది. ఈ వీడియోను ఒక పర్వతారోహకుడు తన కెమెరాలో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ షాకింగ్ వీడియో @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 16 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షల 35 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత, వినియోగదారులు వివిధ రకాల ప్రతిచర్యలను కూడా ఇచ్చారు. ఒక వినియోగదారు ‘సహజంగానే ఇది పెద్ద విజయం కాదు’ అని వ్రాశారు, మరొక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఎవరెస్ట్ శిఖరంపై ట్రాఫిక్ జామ్ అనేది ఇది తన జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..