Viral Video: సోషల్ మీడియా(Social Media)లో.. తరచుగా జంగిల్ సఫారీ(Safari Forest) లో పర్యాటకుల సందడి చేస్తున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. అయితే గత కొన్ని రోజులుగా ఓ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లను ఈ వీడియో బాగా కట్టుకుంటుంది కూడా.. ఎందుకంటే.. ఎంతటి వీరులైనా సింహాలు, పులులు వంటి క్రూరమృగాలు చూస్తే.. ఆమడదూరం పరిగెడతారు. కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి.. సింహాల మందతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతేకాదు.. ఆ సింహాలకు ఆహారం పెడుతూ.. అడిస్తున్నాడు.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కొంతమంది పర్యాటకులు .. అడవిలో సింహాల మందతో నిలబడిన ఒక వ్యక్తిని తమ ఫోన్‌లో బంధిస్తున్నారు. అడవిలో నాలుగు సింహాలు తమ కేర్‌టేకర్‌తో నిలబడి ఉన్నాయని. వాటి సంరక్షకుడు వాటికి ఆహారం పెట్టడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. సింహాల సంరక్షకుడు ఒకొక్క సింహానికి ఆహారం ఎంతో ఇష్టంగా నిర్భయంగా తినిపించాడు. అవి కూడా సింహాలులా కాకుండా పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి ఎలా తమ యజమాని ఆహారం పెడితే.. ఇష్టంగా ఒద్దికగా తింటాయో అదే విధంగా సింహాలు తమ తమ స్థానాల్లో కూర్చుని కేర్ టేకర్ ఇచ్చిన ఆహారాన్ని హాయిగా తింటున్నాయి.
ఈ వీడియో మైఖేల్ గాబ్రియేల్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక సోషల్ మీడియా వినియోగదారు “నేను ఎల్లప్పుడూ సింహాలను తగినంత రక్షణ తీసుకుని చూస్తుంటాను. మీరు కూడా సింహాలను చూసే ముందు.. తగినంత రక్షణ తీసుకోండి.. ఇంటికి సురక్షితంగా ప్రాణాలతో చేరుకోండి అని కామెంట్ చేశారు. మరొక నెటిజన్.. “నేను క్రూరమృగాల్లో దేనినీ నమ్మను, ముఖ్యంగా సింహాలను.. ఎందుకంటే.. అవి మనిషి వెనుక నుండి అతని మెడపైకి ఎప్పుడు దూకుతామా ఆలోచిస్తూనే ఉంటుందని కామెంట్ చేశాడు.
Also Read: సమోసాని ఇప్పటికీ రూ.2.50 లకే అమ్ముతున్న వృద్ధుడు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో