Viral Video: సింహాలు, పులులు, భూమిపై ఉండే అత్యంత ప్రమాదకరమైన అడవి జంతువులు. అయితే పాములలో కూడా చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. ప్రపంచంలో వేలాది రకాల పాములు ఉన్నప్పటికీ అన్ని పాములు విషపూరితం కావు. కొన్ని పాములు చాలా విషపూరితమైతే కొన్ని తక్కువ విషాన్ని కలిగి ఉంటాయి. అయితే సామాన్యులకు వాటి మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. అందుకే అన్ని పాములకు దూరంగా ఉండటం మంచిది. మనం విషం లేని పాముల గురించి మాట్లాడినట్లయితే అందులో కొండచిలువ ఉంటుంది. ఇది భారీగా ఉన్నప్పటికీ దాని లోపల విషం ఉండదు. కానీ అవి ఎరని చుట్టుకొని చంపేస్తాయి. తాజాగా కొండచిలువ, పులికి సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని నెటిజన్ల తెగ లైక్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కొండచిలువ, పులికి సంబంధించిన ఈ వీడియో నెటిజన్లని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే పులులు సాధారణంగా భూమిపై ఉండే అత్యంత భయంకర జంతువులు. వేటలో వీటకి సాటిలేదు. అయితే అనుకోకుండా ఒక పులి.. కొండచిలువను చూసి భయపడిపోతుంది. వీడియోలో పెద్ద కొండచిలువ రహదారిపై పడుకొని ఉండటం మనం చూడవచ్చు. అటుగా నడుచుకుంటూ వెళ్లే పులి దానిని చూసి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొండచిలువ బుసలు కొడుతూ కదలడం ప్రారంభిస్తుంది. దీంతో పులి ఒక్కసారిగా భయపడి వెనక్కి వెళ్లిపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. రకరకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు.
ఈ షాకింగ్ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోని 2 లక్షల 80 వేల మందికి పైగా చూశారు. 7 వేల మందికి పైగా లైక్ చేసారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో తమ అభిప్రాయాలని వెల్లడిస్తు్న్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.