
భారతదేశ జాతీయ జంతువు, జాతీయ పక్షిని ఒకే ఫ్రేమ్‌లో చూపించే అరుదైన దృశ్యం నెటిజన్స్‌కు కనువిందు చేస్తుంది. ఆ అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశ గొప్ప వారసత్వానికి చిహ్నాలైన పులి, నెమలి ఒక ప్రత్యేకమైన దృశ్యంలో కలిసి కనిపించాయి. వైరల్ అవుతోన్న వీడియోలో పులి నిశ్శబ్దంగా నెమలి వెనుక నడుస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇలాంటి క్షణాలు చాలా అరుదు. దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ఈ వీడియో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. పులి బలం, ధైర్యానికి చిహ్నం. నెమలి మర్యాద, ఉల్లాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇవి భారతదేశ ఆత్మను ప్రతిబింబించే లక్షణాలు. ఈ వీడియోను రాకేష్ భట్ రికార్డ్ చేశారు. అనంతరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (IFS) డాక్టర్ PM ధాకటే X లో షేర్ చేశారు. “ఒక అద్భుతమైన వీడియో, మన జాతీయ జంతువు, జాతీయ పక్షి ఒకే ఫ్రేమ్‌లో కలిసి భారతదేశ శక్తివంతమైన స్ఫూర్తికి పరిపూర్ణ చిహ్నం.” అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
An amazing video, our national animal and bird, together in one frame! A perfect symbol of India’s vibrant spirit. Wishing everyone a Happy Independence Day.
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं, जय हिंद। 🇮🇳
VC: Rakesh Bhatt#IndependenceDay #JaiHind… pic.twitter.com/25UEfF7xxa— Dr. PM Dhakate (@paragenetics) August 15, 2025
అడవిలో పులి, నెమలిని కలిపి చూడటం కష్టం. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్యర్యపోతున్నారు. నెమలి వెనుక పులి నిశ్శబ్దంగా నడుస్తుంది. అద్భుతమైన క్షణాన్ని సృష్టిస్తుంది. “ఎంత అరుదైన, అందమైన దృశ్యం. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశ గొప్ప సహజ వారసత్వానికి నిజమైన నివాళి” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు.
“ఈ దృశ్యం (ప్రస్తుతానికి) ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంది” అని మరొక యూజర్ రాశారు. ఈ అరుదైన దృశ్యం ఈ రోజు వేడుకలకు మరింత ఆకర్షణీయంగా మార్చింది అంటూ పలువురు నెటిజన్స్ పోస్టు పెట్టారు.