AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఢిల్లీలో కుప్పకూలిన హుమాయున్ దర్గా పైకప్పు… 5 మంది మృతి, పలువురికి గాయాలు

స్వాతంత్ర్య దినోత్సవం మధ్య దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఏరియాలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ప్రమాదం జరిగింది. దర్గా పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది మరణించారు. మృతుల్లో... 3 మంది మహిళలు...

Video: ఢిల్లీలో కుప్పకూలిన హుమాయున్ దర్గా పైకప్పు... 5 మంది మృతి, పలువురికి గాయాలు
Delhi Darga Collapsed
K Sammaiah
|

Updated on: Aug 15, 2025 | 7:59 PM

Share

స్వాతంత్ర్య దినోత్సవం మధ్య దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఏరియాలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ప్రమాదం జరిగింది. దర్గా పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది మరణించారు. మృతుల్లో 3 మంది మహిళలు మరియు 2 మంది పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. 12 మందికి గాయాలయ్యాయి. మరో 11 మందిని సురక్షితంగా బయటపడ్డారు. గాయాలైన వారిని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని హుమాయున్ సమాధి వెనుక ఉన్న పట్టేషా దర్గా 2 గదులు కూలిపోయాయి. NDRF, అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.

ఢిల్లీలో కొద్దిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. హుమాయూన్ సమాధి ప్రాంగణంలోని దర్గా పైకప్పు కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నిజాముద్దీన్‌ ఏరియాతోపాటు.. చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

వీడియో చూడండి:

ఇక.. మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ మరణాంతరం అతని భార్య హుమీదా బాను బేగం ఆదేశానుసారం 1562లో సమాధి నిర్మాణాన్ని చేపట్టారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 16వ శతాబ్దానికి చెందిన హుమాయూన్ సమాధి ఢిల్లీలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. దీనిని సందర్శించేందుకు ప్రతిరోజూ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే.. స్వాతంత్ర్య దినోత్సవం కావడం.. సందర్శకుల రద్దీ పెరిగే వేళ హుమాయూన్‌ దర్గా పైకప్పు కూలడం కలకలం రేపింది.

మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్