AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్వాతంత్య్ర దినోత్సవం రోజున అరుదైన దృశ్యం… ఫారెస్ట్‌ అధికారులు షేర్‌ చేసిన వీడియో వైరల్

భారతదేశ జాతీయ జంతువు, జాతీయ పక్షిని ఒకే ఫ్రేమ్‌లో చూపించే అరుదైన దృశ్యం నెటిజన్స్‌కు కనువిందు చేస్తుంది. ఆ అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశ గొప్ప వారసత్వానికి చిహ్నాలైన పులి, నెమలి ఒక ప్రత్యేకమైన దృశ్యంలో కలిసి...

Viral Video: స్వాతంత్య్ర దినోత్సవం రోజున అరుదైన దృశ్యం... ఫారెస్ట్‌ అధికారులు షేర్‌ చేసిన వీడియో వైరల్
Tiger Walks Behind Peacock
K Sammaiah
| Edited By: |

Updated on: Aug 18, 2025 | 12:03 PM

Share

భారతదేశ జాతీయ జంతువు, జాతీయ పక్షిని ఒకే ఫ్రేమ్‌లో చూపించే అరుదైన దృశ్యం నెటిజన్స్‌కు కనువిందు చేస్తుంది. ఆ అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశ గొప్ప వారసత్వానికి చిహ్నాలైన పులి, నెమలి ఒక ప్రత్యేకమైన దృశ్యంలో కలిసి కనిపించాయి. వైరల్‌ అవుతోన్న వీడియోలో పులి నిశ్శబ్దంగా నెమలి వెనుక నడుస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇలాంటి క్షణాలు చాలా అరుదు. దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ఈ వీడియో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. పులి బలం, ధైర్యానికి చిహ్నం. నెమలి మర్యాద, ఉల్లాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇవి భారతదేశ ఆత్మను ప్రతిబింబించే లక్షణాలు. ఈ వీడియోను రాకేష్ భట్ రికార్డ్ చేశారు. అనంతరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (IFS) డాక్టర్ PM ధాకటే X లో షేర్ చేశారు. “ఒక అద్భుతమైన వీడియో, మన జాతీయ జంతువు, జాతీయ పక్షి ఒకే ఫ్రేమ్‌లో కలిసి భారతదేశ శక్తివంతమైన స్ఫూర్తికి పరిపూర్ణ చిహ్నం.” అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

వీడియో చూడండి:

అడవిలో పులి, నెమలిని కలిపి చూడటం కష్టం. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ ఆశ్యర్యపోతున్నారు. నెమలి వెనుక పులి నిశ్శబ్దంగా నడుస్తుంది. అద్భుతమైన క్షణాన్ని సృష్టిస్తుంది. “ఎంత అరుదైన, అందమైన దృశ్యం. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశ గొప్ప సహజ వారసత్వానికి నిజమైన నివాళి” అని ఒక నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు.

“ఈ దృశ్యం (ప్రస్తుతానికి) ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంది” అని మరొక యూజర్‌ రాశారు. ఈ అరుదైన దృశ్యం ఈ రోజు వేడుకలకు మరింత ఆకర్షణీయంగా మార్చింది అంటూ పలువురు నెటిజన్స్‌ పోస్టు పెట్టారు.

Follow Us
తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్
సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్
తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని ఏం చేశాడంటే?
తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని ఏం చేశాడంటే?
మీరు వాడే నెయ్యి మంచిదా.. కల్తీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ..
మీరు వాడే నెయ్యి మంచిదా.. కల్తీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ..
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా