Viral Video: సక్సెస్ కూడా ఇంతే.. కొత్త వారానికి ఘనమైన ప్రారంభం.. మహీంద్ర జీప్ నుంచి స్ఫూర్తిని పొందండి..!

|

Jul 08, 2024 | 12:58 PM

భారత వ్యాపార దిగ్గజం.. ఆనంద్‌ మహీంద్రా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌గా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతీ ఒక్కరికి ఆనంద్ మహీంద్రా గురించి తెలుసు.. అయితే.. ఆనందర్ మహీద్రా నిత్యం సోషల్‌ మీడియాలో ఏదో ఒక ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అందరిలో స్ఫూర్తిని నింపుతుంటారు.

Viral Video: సక్సెస్ కూడా ఇంతే.. కొత్త వారానికి ఘనమైన ప్రారంభం.. మహీంద్ర జీప్ నుంచి స్ఫూర్తిని పొందండి..!
Viral Video
Follow us on

భారత వ్యాపార దిగ్గజం.. ఆనంద్‌ మహీంద్రా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌గా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతీ ఒక్కరికి ఆనంద్ మహీంద్రా గురించి తెలుసు.. అయితే.. ఆనందర్ మహీద్రా నిత్యం సోషల్‌ మీడియాలో ఏదో ఒక ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అందరిలో స్ఫూర్తిని నింపుతుంటారు. మహీంద్రా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలు, ట్వీట్స్‌ ఆసక్తికరంగా ఉండడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.. ప్రపంచ నలుమూలలలో జరిగే అద్భుత విషయాలను, సరికొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను నెటిజన్లతో పంచుకోవడం ఆనంద్‌ మహీంద్రాకు హాబీ.. ఈ క్రమంలోనే తాజాగా మహీంద్రా దిగ్గజం పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో సహాయంతో మహీంద్రా కీలక సందేశం ఇచ్చారు.. మార్గం వంకరగా ఉన్నా లేదా ఏటవాలుగా ఉన్నా.. గమ్యం ఆశ.. లక్ష్యం వైపు తీసుకెళ్తుంది.. అనే సందేశాన్ని జతచేశారు. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు, సమస్యలు ఉంటాయి. సక్సెస్ కు అవి భారం కాదు.. ఎన్ని సమస్యలు ఉన్నా సరే.. ఆశ ఉంటే పోరాడి లక్ష్యాన్ని చేరుకోవచ్చు.. అని ఆనంద్ మహీంద్రా స్ఫూర్తి సందేశాన్ని ఇచ్చారు. ఎన్ని సమస్యలున్నా.. తమకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని.. పోరాడి లక్ష్యం వైపు చేరుకోవచ్చని చెప్పారు.

ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేసిన వీడియో..

వీడియోలో ఏముందంటే..

పారిశ్రామికవేత్త పంచుకున్న ట్వీట్ లో.. వీడియో సృష్టికర్త జోష్ కోయెల్‌బెల్ పోస్ట్ చేసిన క్లిప్ లో ఆఫ్-రోడింగ్ కోసం పాత మహీంద్రా జీప్‌ను ఒక వ్యక్తి నడుపుతున్నాడు.. భారీ గుంతల్లో జీప్ ను డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ కనిపించారు.. మార్గంలో రెండు వైపులా ఉన్న గుంతలను దాటుతూ జీప్ చివరకు మైదాన ప్రాంతానికి చేరుకుంటుంది.. ఇలాంటి రహదారిలో ప్రయాణం ప్రమాదకరం.. ప్రాణాంతకం.. కష్టమైనా చివరకు లక్ష్యానికి చేరుకుంటుంది.. జీవితం కూడా అంతే.. అంటూ ఆనంద్ మహీంద్రా తన భావాన్ని వ్యక్తపరిచారు.

సోషల్ మీడియా.. వినియోగించుకున్నవారికి .. వినియోగించుకున్నంత.. అది చెడైనా.. మంచైనా.. అందుకే.. అందరిలో ప్రేరణ కల్పించేందుకు ఈ వారం కొటెషన్ ను మహీంద్రా పంచుకున్నారని నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..