సోషల్ మీడియా పవర్ అంటే ఇది.. కూల్చివేసిన పక్షి గూడు పునర్నిర్మాణ

విద్యుత్ స్తంభంపై పక్షులు నిర్మించుకున్న అందమైన పక్షి గూడును కొన్ని రోజుల క్రితం ఒక లైన్‌మెన్ కూల్చివేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన గూడు  ధ్వంసమైందని తెలియని పక్షి.. తాను నివసించే గూడు మరింత దృఢంగా ఉండటానికి నోటిలో చిన్న చెక్క ముక్కను పట్టుకుని విద్యుత్ స్తంభంపైకి వచ్చింది. ఈ దృశ్యం చూస్తే రాతి మనసుని కూడా ద్రవింపజేసేలా ఉంది. పక్షి గూడును కూల్చివేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో ఇప్పుడు అదే స్థలంలో కొత్త గూడు కట్టారు.

సోషల్ మీడియా పవర్ అంటే ఇది.. కూల్చివేసిన పక్షి గూడు పునర్నిర్మాణ
Birds Nest Video

Updated on: Apr 09, 2024 | 12:01 PM

ఇల్లు ఎవరికైనా ఒక కల.. సొంత ఇంట్లో ఉంచే చాలు ఉన్నదానితో రోజులు గడిపేయవచ్చు అనుకునే వారున్నారు. అదే విధంగా పక్షులు కూడా తాము నివసించడానికి అందమైన గూళ్ళను నిర్మించుకుంటాయి. తమ పిల్లలతో నివసిస్తాయి. పక్షులు అందమైన పక్షి గూళ్లను నిర్మించుకోవడానికి ఇల్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలను ఆశ్రయిస్తాయి. అలా విద్యుత్ స్తంభంపై పక్షులు నిర్మించుకున్న అందమైన పక్షి గూడును కొన్ని రోజుల క్రితం ఒక లైన్‌మెన్ కూల్చివేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన గూడు  ధ్వంసమైందని తెలియని పక్షి.. తాను నివసించే గూడు మరింత దృఢంగా ఉండటానికి నోటిలో చిన్న చెక్క ముక్కను పట్టుకుని విద్యుత్ స్తంభంపైకి వచ్చింది. ఈ దృశ్యం చూస్తే రాతి మనసుని కూడా ద్రవింపజేసేలా ఉంది. పక్షి గూడును కూల్చివేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో ఇప్పుడు అదే స్థలంలో కొత్త గూడు కట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

@official_hindu_sangathan1 ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వైరల్ వీడియోలో లైన్‌మెన్ విద్యుత్ స్తంభంపై కొత్త గూడును నిర్మించడాన్ని చూడవచ్చు. అంతేకాదు అందమైన జంట పక్షులు మనకు గూడు లభించింది. అనే ఆనందంలో గూడు లోపల ప్రశాంతంగా కూర్చున్నాయి. ఈ జంట పక్షులు కూడా వైరల్ వీడియోలో కనిపిస్తూ కనుల విందు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

 ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ రావడంతో.. కూల్చివేసిన గూడును మళ్లీ నిర్మిస్తున్న దృశ్యాన్ని చూసి మానవత్వం ఇంకా బతికి ఉందని నెటిజన్లు అంటున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..