Viral Video: డైపర్ వేసుకుని వచ్చి మరీ దడ పుట్టించింది… అరగంట పాటు కస్టమర్స్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంది
సర్కస్ కంపెనీల్లో కోతులాటకు ఉండే క్రేజే వేరు. భారతదేశంలో కొంత మంది చౌరస్తాల వద్ద కోతులను ఆడిస్తూ జీవనోపాధి పొందుతుంటారు. మనుషుల సిగ్నల్స్‌ను పసిగట్టు చెప్పినట్టు ఆడే కోతులాటను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేస్తుంటారు. కోతులకు ప్రత్యేకమైన డ్రెస్‌లు ధరింపజేసి ఆడిస్తుంటారు. అలా డ్రెస్‌లు వేసుకుని...

సర్కస్ కంపెనీల్లో కోతులాటకు ఉండే క్రేజే వేరు. భారతదేశంలో కొంత మంది చౌరస్తాల వద్ద కోతులను ఆడిస్తూ జీవనోపాధి పొందుతుంటారు. మనుషుల సిగ్నల్స్‌ను పసిగట్టు చెప్పినట్టు ఆడే కోతులాటను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేస్తుంటారు. కోతులకు ప్రత్యేకమైన డ్రెస్‌లు ధరింపజేసి ఆడిస్తుంటారు. అలా డ్రెస్‌లు వేసుకుని ఆడే కోతులను చేసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ కోతి మాత్రం డైపర్ ధరించిన ఓ కోతి ఇప్పుడు నెట్టింటిని ఊపేస్తోంది.
సోమవారం రాత్రి టెక్సాస్‌లో ఓ కోతి హల్‌చల్ చేసింది. ఆ కోతి డైపర్ ధరించి ఉండటంతో అంతా అవాక్కయ్యారు. అది తన యజమాని నుంచి తప్పించుకుని వచ్చి ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ కోతి చేష్టలు చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్లానోలోని స్పిరిట్ హాలోవీన్ స్టోర్‌లో డైపర్ ధరించిన ఆ కోతి నానా హంగామా చేసింది. సోషల్ మీడియాలో కోతికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
వీడియోలో కోతి స్తంభాలను ఎక్కి అలంకరణలపైకి దూకుతున్నట్లు చూపిస్తున్నాయి. ఆశ్చర్యపోయిన కస్టమర్లు కోతి ఏం చేస్తుందో.. ఎవరి మీద దాడి చేస్తుందోనని భయాందోళనకు గురయ్యారు. ఈ లోపు పోలీసులు వచ్చేసరికి దాన్ని పట్టుకునేందుకు చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారు. కోతి యజమాని దానిని కుక్కీతో కిందకు దించడంతో చివరికి వీడియో ముగిసింది.
వీడియో చూడండి:
డైపర్ ధరించిన కోతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
