Viral Video: కిటికీ నుంచి బస్సు ఎక్కుతుండగా అనూహ్య ఘటన.. ఒక్కసారిగా ఊడొచ్చిన కిటికీ..!

|

Jul 24, 2024 | 1:17 PM

మనలో చాలామంది బస్సు గానీ, రైలు గానీ, కారు గానీ ఎక్కగానే కిటికీ పక్కన సీటు కోసం ప్రయత్నిస్తాం. చాలామంది ముందుగానే కర్చీఫ్ వేసి మరీ విండ్ సీటు కోసం ఆరాటపడతారు. ప్రశాంతంగా గాలి వస్తుందని, చుట్టూ ప్రపంచాన్ని చూడొచ్చని వారి అభిప్రాయం. అయితే తాజాగా ఓ యువకుడు రద్దీ ఉన్న బస్సులో విండో సీటు కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

Viral Video: కిటికీ నుంచి బస్సు ఎక్కుతుండగా అనూహ్య ఘటన.. ఒక్కసారిగా ఊడొచ్చిన కిటికీ..!
Student Falls Down
Follow us on

మనలో చాలామంది బస్సు గానీ, రైలు గానీ, కారు గానీ ఎక్కగానే కిటికీ పక్కన సీటు కోసం ప్రయత్నిస్తాం. చాలామంది ముందుగానే కర్చీఫ్ వేసి మరీ విండ్ సీటు కోసం ఆరాటపడతారు. ప్రశాంతంగా గాలి వస్తుందని, చుట్టూ ప్రపంచాన్ని చూడొచ్చని వారి అభిప్రాయం. అయితే తాజాగా ఓ యువకుడు రద్దీ ఉన్న బస్సులో విండో సీటు కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. విండో ద్వారా బస్సులోకి వెళ్లాలనుకున్న సదరు యువకుడు నడుం విరగ్గొట్టుకున్నాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.

బస్సు ప్రయాణాల్లో సీటు కోసం ప్రయాణికులు పడే అవస్థలు నిత్యం చూస్తూనే ఉంటాం. ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో వినూత్న విన్యాసాలు చేస్తుంటారు. ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కేస్తుంటే, మరికొందరు కిటికీల నుంచి లోపలికి దూరిపోతారు. తాజా ఘటన మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో ఓ విద్యార్థి ఇంటికి వెళ్లేందుకు వేచి చూశాడు. ఇంతలో ఓ బస్సు రానే వచ్చింది. అయితే ఆ బస్సు కోసం అప్పటికే చాలా మంది ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. తనకు సీటు దొరకడం కష్టంగా భావించిన సదరు విద్యార్థి ఎలాగైనా సీటు సంపాదించాలనే ఉద్దేశంతో బస్సు మధ్యలోకి వెళ్లి తన బ్యాగును కిటికీలో నుంచి లోపలికి విసిరేశాడు.

ఆ తర్వాత తానూ కూడా కిటికీలో నుంచి బస్సులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పుడే గమత్తు చోటుచేసుకుంది. ముందుగా కిటికీని రెండు చేతులతో పట్టుకుని కాళ్లు లోపలికి పెట్టాడు. ఆ తర్వాత కిటికీపై అంచు పట్టుకుని లోపలికి దూరేందుకు ప్రయత్నించాడు. అయితే బస్సుకు ఉన్న కిటికీ మొత్తం ఊడిపోయి వచ్చేసింది. దీంతో కిటికీతో పాటు విద్యార్థి సైతం ధబేల్‌మని కింద పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా షాక్ అయ్యారు. కింద ఉన్న కొందరు పరుగుపరుగున అక్కడికి వెళ్లి విద్యార్థిని పైకి లేపారు. కాగా, సదరు విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

వీడియో… 

అయితే ఇదంతా మరో బస్సులో ఉన్న ప్రయాణికుడు ఈ ప్రమాదాన్ని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కాగా, విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడకండి, లేకపోతే ప్రమాదం కొని తెచ్చుకోవల్సి వస్తుంది. ఇదిలా ఉంటే, ఈ వైరల్ వీడియో నేపథ్యంలో బస్సు అధ్వాన్నమైన పరిస్థితి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…