
సాధారణంగా అక్కడ పాము కనిపిస్తేనే ఇక్కడి నుంచే పరార్ అవుతుంటారు. ఎంతో ధైర్యం ఉంటే తప్పా పామును చేతితో పట్టుకోవడానికి సాహసించరు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం అలాంటి ఇలాంటిది కాదు. తన ఇంటిలోకి దూరిన పొడవాటి పాముకు ఓ వృద్దురాలు చుక్కలు చూపెట్టింది. ఎంతలా అంటే ఆ పాముకే గనక మనసు ఉంటే మరోసారి ఆ ఇంటిలోకి దూరేందుకు ధైర్యం చేయనంతగా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పెద్దలు కూడా పామును చూసి భయపడుతుండగా, ఈ వృద్ధ మహిళ భయంకరమైన ఫీట్ చేసింది. వైరల్ వీడియోలో, ‘షెర్డిల్ దాది’ 8 అడుగుల పొడవైన పామును సింగిల్ హ్యాండ్‌తో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా నిర్భయంగా పట్టుకుని మెడలో చుట్టుకోవడం చూడవచ్చు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన పూణేలోని ముల్షి తాలూకాలోని కాసర్ అంబోలి గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది.
ఎలుకలకు రుచి మరిగిన పాము 70 ఏళ్ల శకుంతల సుతార్ ఇంట్లోకి ప్రవేశించింది. కానీ సహాయం కోసం ఎవరినైనా పిలవడానికి పిలవలేదు. భయాందోళన చెందలేదు. ఆ వృద్ధ మహిళ స్వయంగా పామును పట్టుకుంది. ఆమె ఇలా చేయడం చూసిన అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.
శకుంతల సుతార్ ఉద్దేశ్యం ధైర్యం చూపించడమే కాదు, ప్రజలలో పాముల గురించి అవగాహన పెంచడం, మూఢనమ్మకాలను తొలగించడం కూడా కావొచ్చు. ఇది ఎలుకను తినే పాము, ఇది విషపూరితమైనది కాదని ఆమె అన్నారు. కానీ భయం కారణంగా పాములను చంపుతారు. ఎలుకలను, కీటకాలను తినడం ద్వారా అవి మనుగడ సాగిస్తాయని, వీటి వల్ల పొలాలను కాపాడుకుంటామని అన్నారు. కానీ మూఢనమ్మకాల కారణంగా ప్రజలు ఈ పాములను చంపడం తప్పు అని చెప్పారు.
🐍💪 70 साल की उम्र में भी हौसला जवान!
पुणे के मुलशी तालुका के कासर अंबोली गाँव की शकुंतला सुतार दादी ने जो किया, वो किसी फिल्मी सीन से कम नहीं।
जब उनके घर में धामन सांप निकला, तो दादी ने
ना डर दिखाया
ना हंगामा किया
बल्कि बिना घबराए साँप को खुद पकड़ा
और गले में डालकर लोगों को… pic.twitter.com/eKuoKCntat— Satyaagrah (@satyaagrahindia) July 27, 2025
‘ధైర్యవంతులైన అమ్మమ్మ’ వీడియో సోషల్ మీడియాలో చాలా సందడి చేస్తోంది. ప్రజలు ఆమె ధైర్యాన్ని, స్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. భారతదేశంలో ప్రజలు పాము విషం వల్ల కాదు, సకాలంలో చికిత్స పొందకపోవడం వల్లే చనిపోతున్నారని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. మరొకరు, అమ్మమ్మ, మీరు వ్యాప్తి చేసిన అవగాహన ప్రశంసనీయం అని అన్నారు.