AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Video: కొబ్బరి కాయల్లోనుంచి వింత సౌండ్లు.. అక్కడ కనిపించింది చూసి పరుగో పరుగు

అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల...

Andhra Pradesh Video: కొబ్బరి కాయల్లోనుంచి వింత సౌండ్లు.. అక్కడ కనిపించింది చూసి పరుగో పరుగు
Snaki In Narial Farm
K Sammaiah
|

Updated on: Jul 28, 2025 | 1:10 PM

Share

అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచు పాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది. కొబ్బరి ఒలిచే కార్మికులను పరుగులు పెట్టించింది. అల్లవరంలో కొబ్బరి రాసులో చేరిన తాచుపాము కార్మికులను హడలెత్తించింది.

కొబ్బరి రాసి వద్ద కొబ్బరి కాయలు ఒలుస్తున్న కార్మికులకు వింత శబ్దాలు వినపడ్డాయి. అనుమానంతో కొబ్బిర రాసిలో గమనించిన కార్మికులకు తాచుపాము కనిపించింది. ఒక్కసారిగా తాచుపాము ఒక్కసారిగా పామును చూసిన కార్మికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కొబ్బరి తోట యజమాని శంకర్ కు చెందిన కొబ్బరి రాసి వద్ద తాచుపాము హల్‌చల్‌ చేసింది. అయితే పాము అప్పటికే ఎలుకను తిన్నట్లు గుర్తించారు.

కార్మికుల అలికిడికి తాచుపాము పడగవిప్పి బుసలు కొట్టింది. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకుని సుమారు ఆరడుగుల పామును బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. కొబ్బరి కాయలు నిల్వ ఉంచే చోట ఎలుకలు, కప్పలు ఉండడంతో వాటిని తినడానికి పాములు చేరతాయని ఒలుపు కార్మికులు అప్రమత్తంగా ఉంటూ పనులు చేసుకోవాలని స్నేక్ క్యాచర్‌ వర్మ సూచించారు.

పాము బుసలు కొడుతున్న దృశ్యాలు అక్కడున్న వారు సెల్‌ఫోన్లలో వీడియో తీయడంతో స్థానికంగా వైరల్‌గా మారింది.

వీడియో చూడండి:

Follow Us
5 నిమిషాల ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల మైలేజ్.. ఈ కారు ఫీచర్స్..
5 నిమిషాల ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల మైలేజ్.. ఈ కారు ఫీచర్స్..
బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇంటిని చూస్తారా..? ప్రపంచ కుబేరుడి ఇల్లు
బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇంటిని చూస్తారా..? ప్రపంచ కుబేరుడి ఇల్లు
ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని నాకు ముందే తెలుసు: రాశీఖన్నా
ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని నాకు ముందే తెలుసు: రాశీఖన్నా
హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
ద్రవిడ్, బిన్నీ, మిథాలీలకు బీసీసీఐ లైఫ్‌టైమ్ అవార్డులు
ద్రవిడ్, బిన్నీ, మిథాలీలకు బీసీసీఐ లైఫ్‌టైమ్ అవార్డులు
ఈ నక్షత్రాల్లో పుట్టినవారు భాగ్యవంతులయ్యే ఛాన్స్..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారు భాగ్యవంతులయ్యే ఛాన్స్..!
వేసవిలో కారు ఆగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే
వేసవిలో కారు ఆగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే
ఉగాది గిఫ్ట్‌ అంటే ఇది కదా.. సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్
ఉగాది గిఫ్ట్‌ అంటే ఇది కదా.. సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్
మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే షాక్.. అపార్ట్‌మెంట్‌ ఆక్రమణ
మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే షాక్.. అపార్ట్‌మెంట్‌ ఆక్రమణ
శని గ్రహ ప్రభావంతో చక్రం తిప్పబోయే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..?
శని గ్రహ ప్రభావంతో చక్రం తిప్పబోయే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..?