Viral Video: సింహాలతో సరదాగా సెల్ఫీలు.. ఆడు మగాడ్రా బుజ్జి అంటోన్న నెటిజన్లు..

|

Apr 03, 2022 | 5:45 PM

Selfie with Lions : కుక్క, పిల్లి లాంటి సాధుజంతువులతో ఎలా ఉన్నా పర్లేదు. అవి ఎలాంటి హాని తలపెట్టవు. కానీ పులి, సింహం, ఏనుగులాంటి క్రూర జంతువులతో మాత్రుం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.

Viral Video: సింహాలతో సరదాగా సెల్ఫీలు.. ఆడు మగాడ్రా బుజ్జి అంటోన్న నెటిజన్లు..
Follow us on

Selfie with Lions : కుక్క, పిల్లి లాంటి సాధుజంతువులతో ఎలా ఉన్నా పర్లేదు. అవి ఎలాంటి హాని తలపెట్టవు. కానీ పులి, సింహం, ఏనుగులాంటి క్రూర జంతువులతో మాత్రుం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాటి అరుపులు, గాండ్రింపులకే హడలిపోయేవాళ్లు మనలో చాలామంది ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తి సింహాలతోనే సెల్ఫీలు, వీడియోలు దిగాడు. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్‌ యూఏఈకి చెందిన ఓ పెద్ద వ్యాపార‌వేత్త. దుబాయ్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన హుమైద్ ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఈఎన్‌ఓసీ) సీఈఓగా వ్యవహరిస్తున్నారు. పనిలో ఎంత బిజీగా ఉన్నా లైఫ్‌ను లగ్జరీగా గడపడం అతనికి అలవాటు. పైగా జంతువులంటే ఎంతో ప్రేమ. అందుకే అల్బుకైష్‌ జంగిల్‌ అని తన పేరుతోనే ఏకంగా ఒక జూ పార్కును నిర్వహిస్తున్నాడు. దుబాయ్‌ ఎడారి మధ్య ప్రాంతంలో ఉండే ఈ జూలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లులాంటి ఎన్నో అటవీ జంతువులున్నాయి.

ఎంత బిజీగా ఉన్నా!

కాగా ప్రొఫెషనల్‌ పరంగా ఎంత బిజీగా ఉన్న ఈ మూగ జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు హుమైద్‌. వాటికి కావాల్సిన ఆహార, వసతి సదుపాయాలను సమకూరుస్తుంటాడు. తీరికదొరికినప్పుడల్లా సరదాగా ఆ జంతువుల‌తో ఆడుకుంటాడు. వాటితో ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు. అలా హుమైద్‌ సింహాలతో సెల్ఫీలు దిగిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇందులో ఒక సింహం చెట్టుపై ఉండగా, మ‌రో రెండు కింద ఉన్నాయి. హుమైద్‌ వాటికి కొంత‌దూరంలోనే సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘ మనుషులు, మూగజీవాలకు ఉన్న స్నేహాన్ని చాలామందికి అర్థం కాదు’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ఈ పోస్టులు నెటిజన్లను, జంతుప్రేమికులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘వీడు మాములోడు కాదు. ఈడు మగాడ్రా బుజ్జీ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 Also Read:Sharad Pawar: బీజేపీ వ్యతిరేక కూటమకి నేతృత్వంలో వహించేదీ లేదు.. ఎన్‌సీపీ నేత శరద్ పవార్ క్లారిటీ!

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన చిరుత.. తన ఫ్రెండ్‌ జోలికొస్తే ఊరుకుంటుందా..!

TS TET 2022: టెట్‌ రాసే అభ్యర్థులకి గుడ్‌న్యూస్.. రేపటి నుంచి టీ-సాట్ స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు..!