Viral Video: సోఫాలో దర్జాగా చుట్టుకుని నిద్రపోతున్న ర్యాట్ స్నేక్.. నెట్టింట్లో వీడియో వైరల్

|

Apr 07, 2022 | 8:35 AM

Viral Video: ఇంట్లో సోఫా మీద దర్జాగా చుట్టుకుని నిద్రపోతున్న ఏడు అడుగుల పొడవున్న వియత్నామీస్ బ్లూ బ్యూటీ ర్యాట్ స్నేక్(Vietnamese blue beauty rat snake) వీడియో ప్రస్తుతం..

Viral Video: సోఫాలో దర్జాగా చుట్టుకుని నిద్రపోతున్న ర్యాట్ స్నేక్.. నెట్టింట్లో వీడియో వైరల్
Snake Found Under Cushion
Follow us on

Viral Video: ఇంట్లో సోఫా మీద దర్జాగా చుట్టుకుని నిద్రపోతున్న ఏడు అడుగుల పొడవున్న వియత్నామీస్ బ్లూ బ్యూటీ ర్యాట్ స్నేక్(Vietnamese blue beauty rat snake) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో చక్కర్లు కొడుతోంది. ఈ షాకింగ్ ఘటన కాలిఫోర్నియా (California) లో చోటు చేసుకుంది. యూట్యూబ్‌లో 9న్యూస్ షేర్ చేసిన వీడియో క్లిప్‌లో ఈ పాము చుట్టుకొని మంచంపై దాక్కున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సో-కాల్ రాటిల్‌స్నేక్ రిమూవల్ అనే ఫేస్ బుక్ (Facebook )లో షేర్ చేసిన మరొక వీడియో క్లిప్‌లో.. ఈ భారీ పాముని పట్టుని ఆడుతున్నాడు. అలెక్స్ తేజో.. ఈ ఏడడుగుల పాముని తోకపై పట్టుకుని కనిపించాడు. ఆ పాముని పట్టుకున్న అలెక్స్ .. ఇప్పుడు ఏమి చేయాలో నాకు కూడా తెలియదు. అయితే ఇంట్లో ఉన్న ఈ పామును  పట్టుకోమంటూ నన్ను పిలిచారు” అని చెప్పడం తెలుస్తోంది. పాముని పట్టుకున్న అలెక్స్ మీదకు దూకుతున్న దానిని నుంచి తనను తాను లాఘవంగా తప్పించుకున్నాడు.

ఈ వీడియోలో “జీవితకాలంలో ఒక పాముని రక్షించండి!” క్యాప్షన్ జత చేశారు. అయితే ఈ పాము మంచంపైకి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ రహస్యం. “దాని గురించి మాకు ఇంకా ఖచ్చితంగా తెలియలేదంటూ..  “సో-కాల్ రాటిల్‌స్నేక్ రిమూవల్ ఫేస్‌బుక్ వినియోగదారు ఇంట్లో పాము ఎలా వచ్చిందనే ప్రశ్నకు బదులిచ్చారు. కొంతమంది వినియోగదారులు పామును చూసి ఆశ్చర్యపోతే.. ఎంత భారీ పాము అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

ఈ జాతి పాములను పెంపుడు జంతువుగా చూసుకోవడం చట్టబద్ధమైని.. ఆ పాము తన యజమాని నుండి తప్పించుకొని ఉండవచ్చని మరొకతను వ్యాఖ్యానించాడు.

Also Read: Hibiscus Flower: మందారం పువ్వుని ఈ విధంగా వాడండి.. ఇంట్లో సంపద, ఆనందం మీ సొంతం