Viral Video: చెట్టును న‌ర‌క‌నివ్వ‌కుండా విశ్వ‌ప్ర‌య‌త్నం చేసిన‌ కుక్క.. మ‌న‌సును క‌దిలిస్తున్న వీడియో

|

Jun 14, 2021 | 4:46 PM

ఈ ప్రపంచంలో ఎక్కువ తెలివితేట‌లు త‌న‌కే ఉన్న‌ట్లు ఫీల్ అవుతాడు మ‌నిషి. కానీ నాగ‌రికం తెలియ‌ని జంతువుల కంటే ఎక్కువ త‌ప్పులు చేస్తాడు. అందుకు మ‌నం....

Viral Video: చెట్టును న‌ర‌క‌నివ్వ‌కుండా విశ్వ‌ప్ర‌య‌త్నం చేసిన‌ కుక్క.. మ‌న‌సును క‌దిలిస్తున్న వీడియో
Dog Stopping Cutting Down Tree
Follow us on

ఈ ప్రపంచంలో ఎక్కువ తెలివితేట‌లు త‌న‌కే ఉన్న‌ట్లు ఫీల్ అవుతాడు మ‌నిషి. కానీ నాగ‌రికం తెలియ‌ని జంతువుల కంటే ఎక్కువ త‌ప్పులు చేస్తాడు. అందుకు మ‌నం ప్రస్తుతం ఎదుర్కుంటున్న వైప‌రిత్యాల‌నే ఉదాహార‌ణగా చెప్ప‌వ‌చ్చు. అయితే, కొన్నిసార్లు ఆ మనిషి చేస్తున్న తప్పులను నోరులేని జంతువులు అడ్డుకుంటాయి. తాజాగా అలాంటి ఘ‌టనే కెమేరాకు చిక్కింది. ఓ వ్యక్తి చెట్టును నరికేందుకు గొడ్డలి తీసుకొస్తే.. కుక్క వద్దు అంటూ అతడికి అడ్డు పడింది. చెట్టును కొట్టేసేందుకు ఎంత ప్రయత్నించినా ఆ శునకం నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలీదో కానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ప్రజలు తమ సొంత ప్రయోజనం కోసం చెట్లు, మొక్కలను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారు. కానీ, ‘ప్రకృతి నాశనం అంటే భూమిని నాశనం చేయడం. త‌మ‌ని తాము నాశనం చేసుకోవ‌డం’ అని అందరూ గుర్తించ‌లేక‌పోతున్నారు. ఇతను కూడా అలాంటి ప‌నికే పూనుకున్నాడు. కానీ శున‌కం అత‌డిని అడ్డుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేసింది. నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. పర్యావరణం పట్ల శునకం చూపిస్తున్న శ్రద్దకు అందరూ శభాష్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీడియో దిగువ‌న చూడండి

 

Also Read: జోక్ నచ్చ‌లేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి

MANSAS trust ఛైర్మన్‌ సంచయిత నియామక జీవో రద్దు.. అశోక్‌ గజపతిరాజును పునర్నియమించాలని హైకోర్టు ఆదేశం