Viral Video: వామ్మో.. రియల్ హర్రర్… అలనాటి విఠలాచార్య సినిమాలను గుర్తు చేస్తూ..తలను తిప్పేస్తున్న అమ్మాయి..

|

Mar 07, 2022 | 3:45 PM

Viral Video: సోషల్ మీడియా(Social Media)లో రోజు అనేక రకాల వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటె.. మరికొన్ని వింతలు విశేషాలతో ఉంటాయి.. ఇంకొన్ని వావ్ అనిపిస్తే.. ఇంకొన్ని షాక్ ఇస్తూ.. ఇది నిజంగా నిజమేనా

Viral Video: వామ్మో.. రియల్ హర్రర్... అలనాటి విఠలాచార్య సినిమాలను గుర్తు చేస్తూ..తలను తిప్పేస్తున్న అమ్మాయి..
Viral Video
Follow us on

Viral Video: సోషల్ మీడియా(Social Media)లో రోజు అనేక రకాల వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటె.. మరికొన్ని వింతలు విశేషాలతో ఉంటాయి.. ఇంకొన్ని వావ్ అనిపిస్తే.. ఇంకొన్ని షాక్ ఇస్తూ.. ఇది నిజంగా నిజమేనా అనేఫీలింగ్ కలిగిస్తాయి. తాజాగా నెట్టింట్లో ఒక విచిత్రమైన వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసినప్పుడు అర్ధం కాక  అయోమయంగా అనిపిస్తుంది… తర్వాత ఒళ్లు జలదరిస్తుంది. వెన్నులో చిన్న వణుకు కూడా పుడుతుంది. ఒక అమ్మాయి చేసిన ఫీట్‌కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వారికీ అయితే అలనాటి విఠలాచార్య సినిమాలను గుర్తు చేస్తుంది ఈ అమ్మాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో nation.video  అనే పేజీలో ఓ యూజర్‌ రెండ్రోజుల కిందట ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి ఓ కుర్చీలో కూర్చొని ఉంది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఆమె కాళ్లు కుర్చీ కింద క్లియర్‌గా కనిపిస్తున్నాయి. కానీ పైన తల కనిపించట్లేదు. తలపై ఉన్న జుట్టు కనిపిస్తోంది. మొండెం కూడా తేడాగా కనిపిస్తోంది. దాంతో ఇది ఏమై ఉంటుందా.. అని నెటిజన్లు అనుమానంగా.. చూస్తున్నారు. ఇంతలో చేతులు కదుపుతూ ఆ అమ్మాయి గిర్రున కెమెరావైపు తిరిగింది. అసలు విషయం అప్పుడు అర్థమయింది. అప్పటివరకూ తను 180 డిగ్రీస్‌లో నడుమును తిప్పి ఉంచిందని. ఆ పాప తన శరీరాన్ని రివర్సులో తిప్పడం చూసి నెటిజన్లు చాలా మంది ఇది నిజమా, గ్రాఫిక్సా అంటున్నారు. చూస్తుంటే నమ్మశక్యంగా లేదు అంటున్నారు. ఇక ఈ వీడియోపై స్పందిస్తూ “ఈ అమ్మాయికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా “ఓర్నాయనో ఏంటిది” అని మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఆమె అన్నాబెల్లే” అని హాలీవుడ్ హర్రర్ సినిమాల్లోని దెయ్యం బొమ్మను గుర్తుచేశారు మరో యూజర్. ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు లైక్స్‌తో.. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు..

కొంతమంది ఇలాంటి ఫీట్స్ ను చిన్నతనం నుంచి సాధన చేస్తే సాధ్యమేనని.. ఎందుకంటే చిన్నతనంలో బాడీకి  ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది.  కనుక చిన్నతనం నుంచి నిపుణుల పర్యవేక్షణలో ఇలాంటి వ్యాయామాలు చేయిస్తే… ఎలాంటి పనులైనా సాధ్యమేనని అంటున్నారు. అయితే ఖచ్చితంగా సరైన పర్యవేక్షకుడి సమక్షంలోనే శిక్షణ పొందాలని సూచిస్తున్నారు. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

 

Also Read:

Travel tips: మొదటిసారిగా విదేశానికి విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ఐదు దేశాలు బెస్ట్ ఎంపిక..(Photo Gallery)