రెమాల్ తుఫాను ఎఫెక్ట్ తో అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నది నీటి మట్టం పెరిగింది. ఫలితంగా వరద పోటెత్తే పరిస్థితి ఏర్పడింది. నదిలో నీరు ఉప్పొంగుతున్న నేపధ్యంలో కారిగంజ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వరద నీటిలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఇలా నీటిలో చేపలు పట్టే క్రమంలో 4 కళ్లు, పొడవాటి వెన్నెముక ఉన్న అరుదైన చేప వలలో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆల్ ఇండియా రేడియో న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆల్ ఇండియా రేడియో న్యూస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ అరుదైన చేప వీడియోను షేర్ చేసింది, “నాలుగు కళ్ళు , పొడవాటి వెన్నెముకతో ఉన్నన అరుదైన చేప కరీంగంజ్ జిల్లాలో వరద నీటిలో దొరికిందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో చేప అరుదైన నలుపు, తెలుపు రంగు కలయిక, నాలుగు కళ్ళు, పొడవైన వెన్నెముకతో వింతగా కనిపిస్తోంది. వరద నీటిలో వచ్చిన ఈ అరుదైన చేపలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు.
ఈ ఉదయం షేర్ చేసిన వీడియో 85.5 మిలియన్ల వ్యూస్ ను రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఒక వినియోగదారు ఇది క్రోక్ ఫిష్ అని.. అక్వేరియం శుభ్రం చేయడానికి ఉపయోగించే చేప అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..