
మనల్ని రక్షించడానికి దేవుడు అన్ని చోట్లా ఉండలేడని అందుకే అమ్మను సృష్టించాడని అంటారు. ఇది మనుషులకే కాదు జంతువులకు, పక్షులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయం తరచుగా చూస్తున్న సంఘటనలతో నిజం అనిపిస్తుంది ఎవరికైనా.. పిల్లల విషయానికి వస్తే తల్లి ఏదైనా చేస్తుంది. తన శక్తికి మించి పోరాడుతుంది. ఇంకా చెప్పాలంటే తన పిల్లలని రక్షించుకోవడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చినా వెనకడుగు వేయదు తల్లి. ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కొండచిలువ ప్రమాదకరమైన పాము అన్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికితే జంతువులని కాదు.. మనుషులను సైతం మింగేసి తాపీగా అరిగించుకుంటుంది. తన శరీరాన్ని చుట్టి ఎరను పట్టుకుంటుంది. ఏదైనా జంతువు దీని బారిన పడితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.. అయితే ఇలాంటి కొండ చిలువతో సైతం ఓ తల్లి పోరాడినప్పుడు .. ఆ తల్లి ప్రేమకు ఫలితం మారవచ్చు. అందుకు సజీవ సాక్ష్యం ఈ వీడియో.. కొండచిలువ నుండి తన బిడ్డను రక్షించేందుకు ఆడ కంగారూ కొండచిలువతో పోరాడిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఓ కొండ చిలువ కంగారు పిల్లలను చుట్టేసింది. అది కొండచిలువ నుంచి విడిపించుకోలేక ప్రాణాల కోసం విలవిలాడుతోంది. ఆ సమయంలో కంగారు పిల్ల తల్లి వచ్చి కొండచిలువపై నిరంతరం దాడి చేచేస్తూనే ఉంది. కొండచిలువ పట్టు సడలే వరకూ కొండచిలువని పళ్లతో కోరుకుతూనే ఉంది. ఓ వైపు కొండచిలువపై దాడి చేస్తూనే మరోవైపు తనని తాను రక్షించుకుంటూ తన పిల్ల కోసం తల్లి పడుతున్న తపన ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఇదేకదా తల్లి ప్రేమ అనిపిస్తుంది. అయితే చివరకు ఏమి జరిగిందనే విషయం మాత్రం అందుబాటులో లేదు.
Instaలో ఈ క్లిప్ Wildanimal9030 అనే ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటివరకు వేలాది మంది చూశారు. రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు తల్లి ప్రేమకు సెల్యూట్ చేస్తున్నారు. తన పిల్లను రక్షించుకోవడానికి తనకి ప్రమాదం అని తెలిసినా తెగించి పోరాడుతున్న ఆడ కంగారు ధైర్యాన్ని కొనియాడుతున్నారు. తల్లి తనకంటే ముందు పిల్లల క్షేమం కాంక్షిస్తుందని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..