Viral Video: వామ్మో.. రోడ్డుకు అడ్డంగా భారీ ఫైథాన్.. చూసి హడలెత్తిపోయిన వాహనదారులు.. ఏం చేశారంటే..?

|

Jan 10, 2022 | 9:42 PM

Python Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని

Viral Video: వామ్మో.. రోడ్డుకు అడ్డంగా భారీ ఫైథాన్.. చూసి హడలెత్తిపోయిన వాహనదారులు.. ఏం చేశారంటే..?
Viral Video
Follow us on

Python Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ కొండ చిలువకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న కొండ చిలువను చూసి.. వాహనదారులంతా షాకయ్యారు. అయితే.. రోడ్డుపై అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. వేగంగా వాహనాల వల్ల కుక్కల నుంచి చాలా జంతువులు బలి అవుతున్నాయి. అయితే.. కొంతమంది వల్ల పలు జీవులు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడుతున్నాయి. అయితే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో డ్రైవర్ల అవగాహనకు ప్రజలు ప్రశంసిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో కేరళలోని కొచ్చికి సంబంధించినది. సీపోర్ట్-ఎయిర్‌పోర్ట్ రహదారిపై ఒక భారీ కొండచిలువ కనిపించింది. అది నెమ్మదిగా రోడ్డు దాటుతోంది. అతడిని చూసి కొందరు డ్రైవర్లు తమ వాహనాలను ఆపి కొండచిలువ రోడ్డు దాటేంత వరకు అక్కడే నిలుచున్నారు. దీన్ని చూసి నెటిజన్లంతా వారి వాహనదారుల సమయస్ఫూర్తికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైరల్ అవుతున్న 1.47 నిమిషాల నిడివి గల వీడియోలో ఓ భారీ కొండచిలువ రోడ్డు దాటడాన్ని చూడవచ్చు. కాగా ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కొందరు బాటసారులు కొండచిలువ సురక్షితంగా రోడ్డు దాటేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చివరగా, కొండచిలువ సురక్షితంగా రహదారికి అవతలి వైపుకు చేరుకుంది. దీంతో మళ్లీ ట్రాఫిక్ తిరిగి పున:ప్రారంభమైంది.

వైరల్ వీడియో..

ఈ క్లిప్‌లో చాలా వాహనాలు ఆగిపోతున్నాయి. కానీ ప్రజల దృష్టి మొత్తం ‘స్విగ్గీ’ యూనిఫాం ధరించిన ఓ స్కూటర్ డ్రైవర్‌పై పడింది. ఎందుకంటే.. అతను కొన్ని సెకన్ల పాటు తన వాహనాన్ని ఆపి, పాముకు దగ్గరగా వెళతాడు. అతను ఇలా చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Ratan Tata: స్నేహానికి ఎలాంటి అవధుల్లేవు.. రతన్ టాటా భుజాలపై చేయి వేసి మాట్లాడే కుర్రాడి గురించి తెలుసా..?

Viral Video: లేటెస్ట్ టెక్నిక్.. ఆవులకి ఆ మ్యూజిక్ పెట్టాడు.. ఆదాయం పెంచుకున్నాడు..