Pushpa Movie: అల్లు అర్జున్, (Allu Arjun) సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. సాంగ్స్ తో తగ్గేదెలే వంటి డైలాగ్స్ తో దేశ విదేశాల్లోని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అభిమానులను సొంతం చేసుకుంది. గత ఏడాది రిలీజైన పుష్ప మూవీ క్రేజ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త రీల్స్ కనిపిస్తూ సందడి చేస్తున్నాయి. శ్రీ వళ్ళి, సామి సాంగ్స్ తో పాటు డైలాగ్స్ కూడా ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా గత రెండు రోజులుగా కాశ్మీరీ వ్యక్తి పుష్ప లోని పుష్ప పుష్పరాజ్ అంటూ చెప్పే డైలాడ్ వీడియో చక్కర్లు కొడుతోంది.
కాశ్మీరీ వ్యక్తి పూలు అమ్ముకునే వ్యక్తిగా తెలుస్తోంది. పుష్ప సినిమాలోని సూపర్‌హిట్ డైలాగ్‌ని డిఫరెంట్‌గా చెప్పి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. ట్విట్టర్‌లో వైరల్ అయిన ఈ వీడియోలో సరస్సులో పడవపై నిలబడి మాట్లాడుతున్న కాశ్మీరీ వ్యక్తిని మీరు చూడవచ్చు – పుష్ప అంటే పువ్వు అనుకుంటున్నావా.. పుష్ప అంటే ఫైర్.. ఫైర్.. అంటూనే సరదాగా.. నా పేరు లిల్లీ.. సిల్లీగా చూడకు అంటూ అనర్గళంగా చెప్పిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వ్యక్తి కాశ్మీర్‌లోని అందమైన దాల్ సరస్సులో షికారాలో పువ్వులు విక్రయిస్తున్నాడు.
కాశ్మీరీ వ్యక్తి వీడియోను ఇక్కడ చూడండి
Flower Nahi, Fire Hai Mein!#Kashmir #Kashmiris pic.twitter.com/fun5CDrF2U
— Namrata (@SrinagarGirl) April 27, 2022
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..