
కొన్ని విషయాలలో మనం కట్టుకున్న భార్యను, కన్నతల్లిని కన్విన్స్ చేయాలంటేనే.. తలలు పట్టుకుంటాం. లేడీస్ అంటారురా బాబూ..! అందుకే చాలా విషయాల్లో లేడీస్‌ను కన్విన్స్ చేయడానికి టెక్నికల్‌గా నరుక్కొస్తుంటారు మగవారు. అయితే ఇక్కడొక వ్యక్తి ఏం చెప్పాడో ఏంటో.? ఒకేసారి ముగ్గురు లేడీస్.. అతడు చెప్పిన మాటకు కన్విన్స్ అయిపోయారు. ఏ విషయంలోనని అనుకుంటున్నారా.? ఆ ముగ్గురు లేడీస్‌ను ఒకే బైక్‌పై ఎక్కించుకుని రైడ్‌కు తీసుకెళ్లడానికి మావా.! అవును.. మీరు విన్నది నిజమే. నమ్మలేకపోతున్నారా.? ఈ వీడియో చూసేయండి.
సాధారణంగా మనం బైక్‌పై ఇద్దరు మహిళలు కూర్చున్న ఘటనలు రేర్‌గా చూస్తాం. కానీ ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఏకంగా ఓ వ్యక్తి ముగ్గురు మహిళలను అది కూడా వన్ సైడ్ కూర్చోబెట్టుకుని రైడ్ చేస్తున్నాడు. మన ముందు ఒకరు వన్ సైడ్ కూర్చుంటేనే హ్యాండిల్ తిప్పడానికి అటుఇటూ తెగ ఇబ్బందిపడుతుంటాం. అలాంటిది ఈ వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను వన్ సైడ్ కూర్చోబెట్టుకుని.. బిందాస్‌గా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. ఆ ముగ్గురు మహిళలు చూడటానికి కొంచెం బొద్దుగా ఉన్నారు. మరి మనవాడు అలా ఎలా హ్యాండిల్ తిప్పుతున్నాడో గానీ.. చల్లగాలికి అలా బైక్‌పై ఆంటీలతో షికారు చేస్తున్నాడు. ఇక ఈ తతంగాన్ని కొందరు ఆ వ్యక్తి వెనుక వస్తున్న వారు వీడియో తీయగా.. అది కాస్తా ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తే.. పాపం.! ఆ బైక్‌కు నోరు ఉంటే.. కుయ్యో.! మొర్రో.. అని మొత్తుకునేది అంటూ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
బైక్ హ్యాండిల్ ఎలా తిప్పుతాడు 🧐🤔🤔🧐.
మళ్ళా ఒకే కలర్ శారీస్ 🤣🤣🤣🤣🙏 pic.twitter.com/naRekySc2e— Nani (@Ravanaroy) August 18, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..