AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందయ్యా ఇది.. సరస్సులో ఆ పని ఏందీ..? నెటిజన్ల ఫైర్.. వీడియో వైరల్

నిత్యం ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పంచితే.. మరికొన్ని ట్రోలింగ్ అవుతాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సరస్సులో నలుగురు వ్యక్తులు స్నానం చేస్తున్నారు. అక్కడ వారు చేసిన ఓ పని నెటిజన్లకు కోపం తెప్పించింది.

Viral Video: ఇదేందయ్యా ఇది.. సరస్సులో ఆ పని ఏందీ..? నెటిజన్ల ఫైర్.. వీడియో వైరల్
Soap Bath At Canada Lake
Krishna S
|

Updated on: Aug 14, 2025 | 9:21 AM

Share

సోషల్ మీడియాలో ప్రతి రోజు రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. కొన్ని జనాలను ఆకట్టుకుంటే.. మరికొన్ని ట్రోల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ సరస్సులో కొంతమంది సబ్బుతో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కెనడాలోని బ్రాంప్టన్‌లోని ఒక పబ్లిక్ సరస్సులో ప్రజలు సబ్బుతో స్నానం చేస్తున్న వీడియో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. కిర్క్ లుబిమోవ్ అనే వ్యక్తిలో ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో రెండు జంటలు సరస్సులో స్నానం చేస్తున్నారు. దాంట్లో ఏముంది అంటారా..? వాళ్లు సబ్బును ఉపయోగించారు. దీంతో నీటి వనరులు నాశనం అవుతాయంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

‘‘కెనడా బీచ్‌లు విదేశీయులకు బాత్ రూమ్స్‌గా మారుతున్నాయి. కెనడా మూడవ ప్రపంచ దేశంగా మారుతోంది ’’అని లుబిమోవ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆ వీడియోలో ఉన్నవారు భారతీయులు కావచ్చని వ్యాఖ్యానించారు. దీంతో కొంతమంది జాత్యాంహకర వ్యాఖ్యలకు దిగారు. మరికొంతమంది పర్యావరణ పరిరక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సబ్బులు, డిటర్జెంట్లు వంటి రసాయనాలు నీటి వనరులను కలుషితం చేస్తాయని, ఇది జలచరాలకు హాని కలిగిస్తుందని అంటున్నారు. మరొక నెటిజన్ ‘‘ఆ సబ్బు పర్యావరణానికి చాలా ప్రమాదకరం’’ అని కామెంట్ చేశారు.

విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు

కొంతమంది ఈ చర్యను బాధ్యతారహితంగా పేర్కొంటూ, ప్రజలలో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘‘ఇది చాలా దారుణం. ఎవరూ బహిరంగ నీటిలో ఇలాంటి పనులు చేయకూడదు, ఇది పర్యావరణానికి చాలా హానికరం’’ అని రాసుకొచ్చారు. మరొకరు ‘‘పబ్లిక్ ప్లేసుల్లో ఏది చేయవచ్చు, ఏది చేయకూడదో వీరికి స్పష్టంగా తెలియదు. దీనిపై అవగాహన కల్పించాలి’’ అని సూచించారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో 5 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ రావడం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us