Penguins Funny Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజగా వైరల్ అవుతున్న వీడియో ఎందరో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వాస్తవానికి సరదాగా గడపడం అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. మనుషులైనా, జంతువులైనా.. సరదాగా గడిపే అవకాశం దొరికినప్పుడల్లా విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా.. పెంగ్విన్‌లకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే మీరు కూడా మీ సరదా రోజులను ఖచ్చితంగా గుర్తుకుతెచ్చుకుంటారు. పెంగ్విన్‌లకు సంబంధించిన ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు తెగ ఇష్టపడుతున్నారు. ఇందులో మంచుకొండపై నిలబడి ఉన్న పెంగ్విన్ సముద్రం వైపు చూస్తుండగా.. దాని మరో ఫ్రెండ్.. ఆ పెంగ్విన్‌ను నీటిలోకి నెడుతుంది.
ఈ వైరల్ వీడియోలో సముద్రం మధ్యలో గడ్డకట్టిన మంచుగడ్డ మీద ఒక పెంగ్విన్ నిలబడి సముద్రం వైపు చూస్తుంటుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా దాని స్నేహితులలో ఒకటైన మరో పెంగ్విన్ దానిని నీటిలోకి నెట్టడాన్ని చూడవచ్చు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని.. ఇది చిన్ననాటి రోజులను గుర్తుచేస్తుందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను చూడండి..
వైరల్ వీడియో..
We all must have had such a colleague in School ☺️☺️ pic.twitter.com/zmoJ2xtNhF
— Susanta Nanda IFS (@susantananda3) December 15, 2021
Also Read: