సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి వీడియో నెట్టింట హల్చల్ చేస్తుందో ఎవ్వరం చెప్పలేం. ఏముందిలే అనుకునే వీడియోతోనే చాలా మంది పాపులర్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వీక్షకులకు ఎప్పుడు ఏం నచ్చుతుందో చెప్పడం చాలా కష్టం. సోషల్ మీడియాలో ఎన్నో అనేక రకాలైన వీడియోలను చూస్తూ ఉంటాం. వాటిల్లో ఈ వీడియో కూడా ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఇంటికి వచ్చిన అతిథులకు భారతీయులు ఎంత గౌరవం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటికి వచ్చింది శత్రువు అయినా సరే.. వాడి కడుపు నింపి పంపించడం అలవాటు. ఇందుకు సంబంధించిన ఓ రీలే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ రీల్‌కు ఇప్పటివరకూ 18 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను డిజిటల్ సృష్టికర్త అంకుర్ అగర్వాల్ పోస్ట్ చేశారు.
ఈ రీల్‌లో ఇంటికి వచ్చిన అతిథిని.. సిగ్గు పడకుండా అతనికి సౌకర్యవంతంగా ఉన్న చోట కూర్చోబెడతారు. ఆ తర్వాత భోజనాన్ని వడ్డిస్తారు. ఒకటి తినండి.. ఆ తర్వాత మరొకటి తినండి అని వడ్డించాడు వ్యక్తి. ఆ నెక్ట్స్ రైస్, కర్రీస్ వడ్డిస్తాడు. ఇంకొంచెం ఇంకొంచెం అని మళ్లీ ఆ వ్యక్తి అన్నం, కూరలు.. అతిథికి వడ్డిస్తాడు. ఆ తర్వాత స్పెషల్‌గా మీ కోసం స్వీట్లు తెప్పించానని చెప్పి ఇస్తాడు. ఇంటికి వచ్చిన అతిథి ప్లేట్ తీయబోతే.. వద్దు వద్దు తీయకూడదు.. నువ్వు వెళ్లి అక్కడ హ్యాండ్ వాష్ చేసుకో అని చెప్పి చెప్తాడు. అరే అసలు మీరు ఏం తిన్నారు? సరిగ్గా ఏమీ తినలేదని ఇంట్లో ఉండే వ్యక్తి అంటాడు. ఈ వీడియో కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండటంలో ప్రతీ ఒక్కరూ ఈ వీడియోనూ చూస్తున్నారు. అంతే కాకుండా లైక్, షేర్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియో చూస్తుంటే.. ఇంటికి వచ్చిన అతిథుల్ని భారతీయులు ఎలా గౌరవంగా చూస్తారో అనేదానికి అద్దం పడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల్ వర్షం కురిపిస్తున్నారు. వారు బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు, బంధువులు తమ ఇంటికి వచ్చిన సంఘటనలు గుర్తు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.