
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఇంట్రస్టింగ్‌గా ఉంటే..మరికొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా ఓ భయంకరమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సృష్టిలో ఇలాంటి వింత సంఘటనలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాము చెక్క పలకలోని చిన్న భాగం ద్వారా దాని నోరు తెరిచి ఉంది. మరొక పాము శరీరంలో సగం ఆ నోటి నుండి వేలాడుతోంది. అది వేలాడుతున్న పామును మింగడానికి ప్రయత్నిస్తోంది. పాము శరీరంలో కొంత భాగాన్ని మింగినప్పటికీ, మిగిలిన సగం బయట కదులుతోంది. ఈ వింత దృశ్యం కెమెరాలో రికార్డ్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
వైరల్ వీడియోలో ఒక నాగుపాము చెక్క పలక నుండి తన తలను బయటకు తీసి మరొక పామును మింగుతున్నట్లు చూపిస్తుంది. ఆ చిన్న పామును దాదాపు సగం వరకు నాగుపాము మింగేసింది. దాని శరీరం పైభాగం నాగునోటిలో లోపలికి ఉంది. దిగువ భాగం బయట వేలాడుతూ ఉంది. ఈ ప్రవర్తన నాగుపాములకు సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. నాగుపాములు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. వాటి ప్రాణాంతక విషంతోటి ప్రత్యర్థిని క్షణాల్లో అంతం చేయగలదు. పాములలో, నాగుపాములు తమ జాతిని మింగడానికి వెనుకాడవు. ఆహారం కొరత ఉన్నప్పుడు లేదా సాటి నాగుపాములతో పోటీ ఉన్నప్పుడు పట్టుకుని మింగేస్తాయి.
— Wildlife Uncensored (@TheeDarkCircle) October 2, 2025
ఈ వైరల్ వీడియోను నెట్టింట మిలియన్ల సార్లు వీక్షించారు. ప్రకృతి యొక్క ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. చాలా మంది లైక్ చేసి కామెంట్స్ పెట్టారు. ఒక వ్యక్తి “ఒక పాము ‘నరమాంస భక్షక’ వెర్షన్” ఇది అని రాశారు.