
దొంగతనానికి కూడా అదృష్టం కలిసి రావాలి. లేదంటే విధి వక్రీకరించి వీధిన పడటం ఖాయం అని ఈ సంఘటన నిరూపిస్తుంది. దొంగతనాలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. దొరికితే దొంంగ.. దొరక్కుంటే దొర అనుకున్నాడో ఏమో.. ఓ ముహూర్తం చూసుకుని మరీ చోరీకి పాల్పడితే విధి వక్రీకరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈవీడియోను చూసిన నెటిజన్స్‌కు నవ్వాగడం లేదంటే నమ్మండి. అతను దొంగతనం చేయడానికి వెళ్ళిన విధానం.. అతనికి తగిలిన ఎదురు దెబ్బలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
అతను దొంగతనం చేయడం.. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడం అన్నీ ఓ ఫన్నీలా జరుగుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత, ప్రజలు సరదాగా గడుపుతున్నారు. దొంగ తన స్కూటర్‌పై వస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది, అతని కళ్ళు దుకాణం వెలుపల ఉంచిన పెద్ద బాక్స్‌పై పడ్డాయి. అతను తెలివిగా ఆ బాక్స్‌ను తీసుకొని స్కూటర్‌పై పెట్టుకుంటాడు. కానీ అతను తప్పించుకోవడానికి స్కూటర్ స్టార్ట్ చేయగానే, అతని బ్యాలెన్స్ తప్పిపోతుంది. స్కూటర్, బాక్స్ రోడ్డుపై పడిపోతాయి. భయంతో, దొంగ త్వరగా వస్తువులను సేకరించడం ప్రారంభిస్తాడు, కానీ స్కూటర్ మళ్ళీ పడిపోతుంది.
ఆ దొంగ ఏదో విధంగా స్కూటర్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత బండి స్లిప్ అయి రోడ్డుపై పడిపోతాడు. దొంగతనం విజయవంతం కాలేదు. పారిపోవడంలో విజయం కూడా లేదు! చివరికి, అతను తన స్కూటర్‌ను అక్కడే వదిలి ఖాళీ చేతులతో బతుకుజీవుడా అంటూ పారిపోతాడు.
వీడియోపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ దొంగకు ఎవరి శాపమో తగిలిందని ఒక యూజర్ రాశాడు. అదే సమయంలో మరొకరు ఒకే రోజులో ఒకరికి ఇంత చెడు ఎలా జరుగుతుందని రాశాడు. మరొకరు ఈ దొంగకు చాలా చెడ్డ విషయాలు జరుగుతున్నాయని కామెంట్ పెట్టారు.