Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ..? ట్రక్కులో స్విమ్మింగ్‌.. నెటిజన్లు షాక్

Swimming Pool trending video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు మనముందుకు వస్తున్నాయి. అలాంటి వీడియోల్లో కొన్ని మనసును హత్తుకునేలా చేస్తే.. మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే.. కొన్ని మాత్రం

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ..? ట్రక్కులో స్విమ్మింగ్‌.. నెటిజన్లు షాక్
Swimming Pool Trending Video

Updated on: Jul 24, 2021 | 7:21 PM

Swimming Pool trending video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు మనముందుకు వస్తున్నాయి. అలాంటి వీడియోల్లో కొన్ని మనసును హత్తుకునేలా చేస్తే.. మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే.. కొన్ని మాత్రం ఇలా ఎలా సాధ్యం అనుకునేలా ఆశ్చర్యపరుస్తుంటాయి. కొంతమంది అందరిలా కాకుండా కొంత భిన్నంగా ఆలోచిస్తుంటారు. అందుకే వారు చేసే పనులు సర్వత్రా ఆసక్తికి దారి తీస్తుంటాయి. ఇలాంటి వారు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారు. ఈ సోషల్ మీడియా ప్రపంచంలో తాజాగా ఓ వీడియో తెగవైరల్ అయ్యింది. దీనిలో ఓ కుర్రవాడు ట్రక్టర్ ట్రక్కులో స్విమ్మింగ్‌ చేస్తుంటాడు. అయితే ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత.. ఇలాంటి ఐడియా మనకు ఇప్పటివరకు ఎందుకు రాలేదంటూ చాలా మంది నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోలో ఓ ట్రాక్టర్ ట్రక్కులో కుర్రాడు.. ఆనందంతో ఈత కొడుతుండటాన్ని మనం చూడవచ్చు. ట్రాక్టర్ ట్రక్కులో స్మిమ్మింగ్ ఫూల్ ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ కవర్‌ను ఏర్పాటు చేసి దానిలో నీటిని నింపాడు.. అనంతరం స్మిమ్మింగ్‌ పూల్‌లో స్నానం చేసినట్లు ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ వీడియోను చూసినవారంతా ఔరా.. అంటూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఏదేమైనా కుర్రాడి పని అద్భుతంగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను హెప్‌గల్ 5 అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియోను చూసిన వారంతా ఐడియా బాగుందంటూ నవ్వుకుంటున్నారు. అయినా ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో..

Also Read:

షార్ట్‌లో వచ్చిన బాధితులకు పోలీస్ స్టేషన్‌లోకి నో ఎంట్రీ.. లేడీ పోలీసులు ఉన్నారంటూ..

Global Warming: గ్లోబల్ వార్మింగ్ వలన లాభాలూ ఉన్నాయంటున్నారు.. ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!