ప్రతీ ఒక్కరికి ఏదొక అభిరుచి ఉంటుంది. కొందరికి పాటలు వినడం ఇష్టం.. మరికొందరికి డ్యాన్స్ చేయడం ఇష్టం.. ఇంకొందరికి వంటల్లో ప్రయోగాలు చేయడం అంటే అమితమైన ఇష్టం. ఖాళీ దొరికిందంటే చాలు.. వాళ్లు వంటింట్లోకి వెళ్లి వంటల్లో ప్రయోగాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ ప్రయోగాలు ఫెయిల్ అయినా.. మరికొన్ని సార్లు అద్భుతంగా వస్తాయి. ఇక తాజాగా ఓ వ్యక్తి చేసిన వంట ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సదరు వ్యక్తి చేసిన పనికి మీరు కూడా ఆశ్చర్యపోతారు.! మరి అదేంటో చూసేద్దాం పదండీ.!
అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ వ్యక్తి నాన్(Naan) లోపల బిర్యానీ వండాడు. అతడు పఫ్డ్ నాన్‌ను టేబుల్ మీద ఉంచినట్లుగా మీరు వీడియోలో చూడవచ్చు. దాని టాప్ లేయర్‌ను కత్తితో సర్కిల్‌గా కట్ చేసి.. అందులోని బిర్యానీని ప్లేట్‌లో వడ్డిస్తాడు. చూస్తేనే నోరూరించేలా ఉన్న ఆ బిర్యానీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ta-da ? Can anyone guess the dish name ? pic.twitter.com/AIBr91tPEr
— Praveen Angusamy, IFS ? (@PraveenIFShere) June 28, 2021
ఇదిలా ఉంటే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుసామీ ఈ డిష్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ”ఇది బిర్యానీ లేదా పులావ్ కాదు. అది Lamb Zarb, గొర్రె మాంసం, బియ్యం కొన్ని గంటల పాటు బొగ్గు ఓవెన్‌లలో నెమ్మదిగా వండుతారు. ఈ వంటకం హైదరాబాద్ @ లెవాన్ట్ రెస్టారెంట్‌లో లభిస్తుంది.
Well, it’s neither Biriyani nor Pulao.
It’s a Lamb Zarb, a Jordanian dish of lamb & rice, slow cooked in underground coal ovens for several hours ? This is how the dish was served @ LevanT Restaurant, Hyderabad.
PS. Levant is the historic term for Eastern Mediterranean region. pic.twitter.com/mz63twHxgk— Praveen Angusamy, IFS ? (@PraveenIFShere) June 28, 2021
Also Read:
ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..