
సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ కంటెంట్‌నే నెటిజన్లు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సింహం, మొసలి, పులి, చిరుత వంటి క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక కొన్ని వీడియోలు మనకు క్యూట్‌గా అనిపిస్తే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.
పాముల రారాజు ‘కింగ్ కోబ్రా’ను చూస్తే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీస్తారు. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 99 శాతం బతికే అవకాశం లేదని పెద్దలు అంటుంటారు. అలాంటి కింగ్ కోబ్రా ఓ బీచ్‌లోని అలలపై హాయిగా ఆడుకుంటున్న వీడియో ఒకటి నెటింట్లో హల్‌చల్ చేస్తోంది. సముద్రపు అలల వైపు ఆ పాము కదులుతున్నట్లు కనిపిస్తుంది, అయితే అలలు దాన్ని వెనక్కి నెట్టాయి. కానీ, ఎంతైనా కింగ్ కోబ్రా కదమరీ… వెనక్కి వెళ్లే బదులు మరింత ధైర్యంతో అలల వైపు కదలడం ప్రారంభించింది.. అయితే, ఈ అందమైన వీడియోను అక్కడే ఉన్న కొందరు పర్యాటకులు తమ కెమెరాలో బంధించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోని royal_pythons అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. పైగా అలలతో ఆడుకుంటున్న పాము..అనే క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లతో తమ స్పందనను తెలియజేస్తున్నారు. నిరంతర శ్రమతో త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోగలమని ఒకరంటే.. ఇలా నీటిలో సరదాగా గడుపుతున్న పామును మేం ఫస్ట్‌టైం చూశామంటున్నారు మరికొందరు నెటిజన్లు.
Also Read: