మతసామరస్యానికి ప్రతీక మన భారత దేశం. ఏదోక సందర్భంలో అది రుజువవుతూనే ఉంది. తాజాగా మరోసారి అలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు కానీ అందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోలో ఓ మసీదు ముందు నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరద నీటిలో ఓ ఆవు కొట్టుకుపోతూ ఉంది. అది ఒడ్డుకు చేరాలని ఎంత ప్రయత్నించినా దాని వల్ల కావడంలేదు. అక్కడే మసీదు ముందు ఉన్న ఓ ఇద్దరు కుర్రాళ్ళు ఈ ఆవును గమనించారు. వెంటనే ఆవును కాపాడేందుకు ముందుకు వెళ్లారు. ఆవు కొమ్ములు పట్టుకొని పైకి లాగేందుకు ప్రయత్నించారు. కానీ, నీటి వేగానికి దాన్ని పైకి లాగలేకపోయారు. ఇద్దరు యువకులు ఆవును రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మరో ఇద్దరు వ్యక్తులు గమనించారు. వెంటనే వారు కూడా ఆ యువకులకు జత కలిసి సాయం చేశారు. అలా ఆవుని కాపాడడంలో సాయం చేసిన యువకుల్లో ఒక ముస్లిం యువకుడు కూడా ఉన్నాడు. తలకు నమాజ్ టోపీ పెట్టుకొని వచ్చిన అతను వారికి సాయం చేయడంతో ఆవు నీటి నుంచి బయటకు వచ్చింది.
వాచ్ వీడియో
This video made me smile for more reasons than one! 😊#India #Unity pic.twitter.com/fQ8wUVX8SC
— Shivam Singh (@PoeticShivam) July 21, 2023
దీన్ని అవతలి వైపు ఉన్న వ్యక్తులు వీడియో తీశారు. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఈ వీడియో మనసుకు ఎంతో హాయిని కలిగించింది అంటూ ట్వీట్ చేశారు. భారత్ .. ఐకమత్యం అని హ్యాష్ ట్యాగ్స్ జోడించారు. ఈ వీడియోను 24 గంటల్లో దాదాపు 2 లక్షలమంది వీక్షించారు. వేలాదిమంది లైక్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..