Viral Video: గవర్నమెంట్‌ టీచర్‌ రిటైర్మెంట్‌..ఊరంతా కన్నీటి పర్యంతం… దేశ నిర్మాతలు అంటూ నెటిజన్స్‌ ప్రశంసలు

ఓ టీచర్‌ ఒకేచోట 43 సంవత్సరాలు విద్యా బోధన చేయడం సామాన్య విషయం కాదు. అత్యంత నిస్వార్థ వృత్తి 'బోధన'ను ఎంచుకున్న వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గవ్లా అనే చిన్న గ్రామంలో గొప్ప విద్యా మార్పును తీసుకువచ్చాడు. ఇండోర్ డివిజన్‌లోని ఖర్గోన్ జిల్లా నివాసి ప్రభుత్వ పాఠశాల...

Viral Video: గవర్నమెంట్‌ టీచర్‌ రిటైర్మెంట్‌..ఊరంతా కన్నీటి పర్యంతం... దేశ నిర్మాతలు అంటూ నెటిజన్స్‌ ప్రశంసలు
Teacher Retirement Emotion

Updated on: Sep 05, 2025 | 4:54 PM

ఓ టీచర్‌ ఒకేచోట 43 సంవత్సరాలు విద్యా బోధన చేయడం సామాన్య విషయం కాదు. అత్యంత నిస్వార్థ వృత్తి ‘బోధన’ను ఎంచుకున్న వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గవ్లా అనే చిన్న గ్రామంలో గొప్ప విద్యా మార్పును తీసుకువచ్చాడు. ఇండోర్ డివిజన్‌లోని ఖర్గోన్ జిల్లా నివాసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నూర్ ఖాన్ స్ఫూర్తిదాయకమైన కథ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరూ విద్యకు దూరంగా ఉండకుండా చూసుకోవడం ద్వారా అనేక మంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు.

నూర్‌ఖాన్‌ వీడ్కోలు వేడుక ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వీడియోలో గ్రామస్తులు గౌరవం ఇవ్వడం, ఆయనకు పూలమాల వేయడం, గ్రామం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనను అనుసరిస్తుండగా ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది.

వీడియో చూడండి:


టీచర్‌గా ఖాన్ ప్రయాణం 1980ల చివరలో ప్రారంభమైంది. పేదరికం, నిరక్షరాస్యత తాండవించిన కాలంలో విద్య కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదని ఆయన నమ్మాడు. బదులుగా తన విద్యార్థులకు క్రమశిక్షణ, నైతికతతో సహా వాస్తవ జీవిత విలువలను పరిచయం చేసి, జ్ఞానాన్ని అందించి ఎంతో మంది జీవితాలను మార్చేశారు.

ఆ కాలంలో తల్లిదండ్రుల వ్యతిరేకతను కూడా ఆయన ఎదుర్కొన్నారు.ఆయినప్పటికీ ఆయన వెనుకంజ వేయకుండా ఇంటింటికీ వెళ్లి వారి పిల్లలను పాఠశాలకు పంపమని ఒప్పించేవాడు. చదువులో వెనకబడ్డ విద్యార్థులను నిర్లక్ష్యం చేయలేదు. బలహీనతలతో ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి అదనపు సమయాన్ని వెచ్చించారు.

అందుకే ఆయన వీడ్కోలు వేడుక హృదయపూర్వకంగా జరిగింది. దండలు, ప్రసంగాలు, సన్మానాలు, విద్యార్థులు తల్లిదండ్రుల కన్నీళ్లలో ప్రతిబింబించే చెప్పలేని కృతజ్ఞత. ఆయనలాంటి వారు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు నిజమైన దేశ నిర్మాతలు అంటూ నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.