Viral Video: కారులో భారీ కొండ చిలువ.. ధైర్యంతో బయటకు తీసిన తల్లికొడుకు.. వైరల్‌ అవుతున్న వీడియో..!

Viral Video: ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన కొండచిలువలు, పాములు నివాస ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఒకవైపు పాములు ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి..

Viral Video: కారులో భారీ కొండ చిలువ.. ధైర్యంతో బయటకు తీసిన తల్లికొడుకు.. వైరల్‌ అవుతున్న వీడియో..!

Updated on: Nov 29, 2021 | 3:19 PM

Viral Video: ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన కొండచిలువలు, పాములు నివాస ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఒకవైపు పాములు ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తుంటే.. మరో వైపు వాహనాల్లో దూరి వాహనదారులకు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొన్ని పాములు వాహనం లోపల ఇరుక్కుపోయిన వీడియోలు చూస్తూనే ఉన్నాము. తాజాగా ఓ పాము కారు టైర్‌లో ఇరుక్కుపోయిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. టైర్‌ లోపల వింత వింత శబ్దాలు వస్తుండటంతో ఏదో ఉందని గమనించిన కారు యజమాని కారు టైరులో కొండ చిలువ ఉన్నట్లు గుర్తించి ఆందోళనకు గురయ్యాడు. ఇరుక్కుపోయిన పెద్ద కొండచిలువను తొలగించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

ప్లోరిడాలోని ఓ కారు టైరులో ఇరుక్కపోయిన కొండచిలువను ఓ వ్యక్తి తన తల్లితో కలిసి తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు బయటకు లాగేశారు. 29 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొడుకు కారు టైరులో ఇరుక్కున్న కొండచిలువను తీస్తుండటం, తల్లి దాని తోకను పట్టుకుని బయటకు లాగుతున్న వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆ కొండచిలువను బయటకు లాగుతున్న తల్లిని చూసి కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ఇలా కొండచిలువలు వాహనాల్లో దూరి వింత వింత శబ్దాలు చేస్తుండటంతో ఏదో ఉందని చూసేసరికి ఇలాంటివి బయటపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Viral Video : రెండు తలలు, మూడు కళ్ళు ఉన్న బల్లిని ఎప్పుడైనా చూశారా.. నెట్టింట లక్కీ వీడియో వైరల్..

Viral Video: మొసలితో పరాచకాలు.. జస్ట్ మిస్.. లేదంటే క్షణాల్లో మాంసం ముద్ద అయ్యేవాడు