Green Chilli Halwa: అయ్యో దేవుడా ఇంకా ఎన్ని చూడాలో.. మార్కెట్‌లో మిర్చి హల్వా.. రెసిపీ వీడియో వైరల్

|

May 23, 2024 | 5:53 PM

ప్రస్తుతం ఆహార పదార్థాలతో ఎన్నో ప్రమాదకరమైన ప్రయోగాలను చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొన్నిటిని చూడగానే అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు ముందుకు వచ్చిన ఈ హల్వా ప్రయోగాన్ని చూసిన జనం షాక్ తింటున్నారు. మిర్చితో హల్వా తయారు చేస్తున్న వీడియో చాలా వేగంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా వైరల్ అవుతోంది.

Green Chilli Halwa: అయ్యో దేవుడా ఇంకా ఎన్ని చూడాలో.. మార్కెట్‌లో మిర్చి హల్వా.. రెసిపీ వీడియో వైరల్
Green Chilli Halwa
Follow us on

హల్వా ఒకరమైన స్వీట్.. దేశంలో అన్ని ప్రాంతాల్లో దొరికే హల్వాను ఒకొక్క చోట ఒకొక్క రకంగా తయారు చేస్తారు. అయితే కేరళ హల్వా దేశవ్యాప్తంగా ఫేమస్. హల్వా అని తలచుకున్నా, చూసినా వెంటనే నోటిలో నీళ్లు తిరుగుతాయి. చాలా రకాల హల్వాలను తయారు చేస్తారు. హల్వా కూడా సీజన్ ప్రకారం తయారు చేసి తింటారు. ఈ తీపి వంటకాన్ని ఏడాది పొడవునా తయారు చేసుకుని తినవచ్చు. క్యారెట్ హల్వా, బీట్ రూట్ హల్వా, కేసరి హల్వా, బాదం హల్వా వంటి రకరకాల హల్వాలను రుచి చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మిరపకాయ హల్వా తిన్నారా? కాకపోతే ప్రస్తుతం మిర్చి హల్వా చాలా వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఆహార పదార్థాలతో ఎన్నో ప్రమాదకరమైన ప్రయోగాలను చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొన్నిటిని చూడగానే అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు ముందుకు వచ్చిన ఈ హల్వా ప్రయోగాన్ని చూసిన జనం షాక్ తింటున్నారు. మిర్చితో హల్వా తయారు చేస్తున్న వీడియో చాలా వేగంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న ఈ వీడియో ఫ్యాక్టరీకి సంబంధించినది. ఈ హల్వా ఎలా తయారుచేయాలో కూడా చూపించారు. ముందుగా పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టారు. దీని తరువాత, మిరపకాయలను ఒక పాన్ వేసి దానికి రుచికి సరిపడా చక్కెర, ఆకుపచ్చ రంగు, పాలు, నెయ్యి, జీడిపప్పు వేసి కలిపారు. ఇవన్నీ కలిపిన తర్వాత హల్వాని ఉడికించారు. హల్వా రెడీ అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న హల్వా అచ్చులో వేసి.. అరబెట్టారు. బర్ఫీలా రెడీ అయింది.

ఈ వీడియో indian_street_food_5 పేరుతో Instagramలో షేర్ చేశారు. ఇప్పటికే వేల మంది లైక్ చేయగా, లక్షల మంది దీనిని చూసి, వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఈ రెసిపీ భారతదేశం నుంచి బయటకు వెళ్లకూడదని రాశారు. మరొకరు కోపంగా ఏమి ప్రయోగం ఇది అంటూ కామెంట్ చేశారు. వినియోగదారులు వీడియోను వేగంగా షేర్ చేస్తున్నారు. దీంతో పాటు తమకు ఇష్టమైన తినుబండారాలకు ఇలా అన్యాయం జరగడం చూసి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..