Viral Video: పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పాలి. ఒక వ్యక్తి వందలాది పాములను అడవిలో వదిలిపెడుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘memewalanews’ అనే యూజర్ రెండు రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముందు తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి దాదాపు 300 పాములను విడిచిపెట్టాడని ఈ యూజర్ పేర్కొన్నాడు.
వీడియోలో ఒక వ్యక్తి అడవిలో ప్రార్థనలు చేస్తూ, తన చేతుల్లో ఒక పెద్ద ఆకుపచ్చ రంగు సంచిని బహిరంగ ప్రదేశానికి తీసుకువస్తున్నాడు. గన్నీ బ్యాగ్‌లోంచి బయటకు వచ్చిన పాముల మొత్తాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నెటిజన్లను అత్యంత భయభ్రాంతులకు గురిచేసిన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి తన పాదాల దగ్గర ఉన్న 300 పాములతో నిండిన గోనె సంచిని నిర్భయంగా ఖాళీ చేసిన విధానం. సంచిలోంచి పాములను విడుస్తూ తన చేతులతో పాములను వేర్వేరుగా చేయడం ఒళ్ల గగుర్పొడిచేలా ఉంది.
ఇవి కూడా చదవండి: