ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసేస్తున్నాయి. దీంతో బండి తీసుకుని రోడ్డెక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతాయి. కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయి. కాబట్టి రోడ్డుపై ప్రయాణిస్తున్నా.. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం చెప్పి రాదు.. కాబట్టి ప్రమాదం రాకుండా ముందే మనం అలర్ట్ గా ఉండాలి. ప్రస్తుతం ముంబయి మహా నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీ కొని ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడ్డాడు. నగరంలోని లేక్‌సైడ్ కాంప్లెక్స్ సమీపంలోని ఎవరెస్ట్ హైట్స్ బిల్డింగ్స్ వద్ద ఈ ఘటన జరిగింది.
కేవలం 45 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియో క్లిప్‌లో.. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండటాన్ని చూడవచ్చు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న బస్సు అతనిని ఢీ కొట్టింది. అంతే కాకుండా అతని పై నుంచి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గట్టిగా కేకలు వేశారు. బస్సు ఆపాలని కోరారు. దీంతో బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. అయితే ఆ వ్యక్తిని లేపడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. బస్సు పై నుంచి వెళ్లినా అతనికి గాయాలు కూడా కాకపోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
What a miraculous escape! The accident took place just outside Everest Heights building near LakeHomes. @ChandivaliCCWA @aapchandivali @Vicinia_Society @Bjp4ward157 @poonam_mahajan @OfficeofPoonamM @ChandivaliNYC @avartanpowai @pbwadurgapujo @PowaiResidents @RahejaVihar pic.twitter.com/Xzcg6pd8BH
— My Powai (@mypowai) December 13, 2022
ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఏర్పుడుతున్న ట్రాఫిక్ జామ్ నగరవాసులకు కలవరపెడుతోంది. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క ట్విటర్‌లోనే 14,000 వ్యూస్ సాధించింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..