సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం చర్చనీయాంశంగా అవుతూనే ఉంటాయి. అయితే ఒకొక్కసారి అవి తమాషాగా అనిపిస్తే.. ఒక్కోసారి ఇదేంటి బాబోయ్ అనిపించేలా ఉంటాయి. అదే సమయంలో కొన్నింటిని చూస్తే ఇది నిజమేనా అంటూ తమ కళ్లతో చూసింది తామే నమ్మలేరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఓ వ్యక్తి బాగా ఆకలి వేస్తుంటే ఆత్రంగా ఇష్టమైన ఆహారాన్ని తింటున్నట్లు మేకులను గబగబా తినేస్తున్నాడు.
వాస్తవానికి ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అదే సమయంలో కొందరు వింతగా ఇసక తినడం, జుట్టు తినడం వంటివి చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా విచిత్రాల విషయానికి వస్తే చైనా పేరు ఎవరికైనా వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ దేశ ప్రజల అలవాట్లపై కూడా ప్రపంచ వ్యాప్తంగా రకరాల ఫన్నీ కామెంట్స్ చేస్తారు. చైనీయులు పాకేవీ, ఈదేవీ, ఎగిరేవీ ఇలా ఏదైనా తినేస్తారు అని అంటారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఇందులో మేకులే ఆహారంగా తింటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో ఎంత నిజం ఉందో తెలియదు.. ఇది వాస్తవం అంటూ టీవీ 9 ధృవీకరించడం లేదు.
Kahan se aate hain ye log 🤔😂#viral #OTDirecto2F pic.twitter.com/R0M35DgQ8R
— Divyansh Mishra DM (@DivyanshMishrDM) February 2, 2024
వీడియోలో ఒక వ్యక్తి గడ్డిమీద కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఒక కవర్ అందులో నిండా మేకులు ఉన్నాయి. ఆ మేకులను ఎంతో ఇష్టంగా తింటున్నాడు.. హ్యాపీయా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో మొదటి వ్యక్తి దగ్గరకు మరొక వ్యక్తి వచ్చి.. కవర్ లో ఉన్న మేకులను కొన్నిటిని తీసుకుని ఆ వ్యక్తికీ గోరు ముద్దలు తినిపించినట్లు తినిపిస్తున్నాడు. అంతేకాదు ఇలా మేకులు తింటూ ఈ వ్యక్తులు చాలా సరదాగా నవ్వుతు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇష్టమైన రుచికరమైన వంటకాన్ని ఆస్వాదిస్తూ తింటున్నట్లు చూడవచ్చు.
ఈ క్లిప్ @DivyanshMishrDM అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. రకరకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు స్పందిస్తూ ఇండోనేషియాలోని చాలా మంది ప్రజలు ఈ విధంగా మేకులు తినే అవకాశం ఉందని కామెంట్ చేయగా.. మరొకరు ‘చైనా ప్రజలే వీళ్లు.. వాళ్ళమీద నాకు నమ్మకం లేదు సోదరా’ అనికామెంట్ చేశారు. ఇది కాకుండా చాలా మంది ఇతర వినియోగదారులు కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..