Viral Video: చెట్టు ఎక్కగలవా.. ఓ నరహరి పుట్టలెక్కగలవా.. అన్న పాట ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కదా.. ఆ పాట ఇప్పుడెందుకు అంటారా.. ఓ వ్యక్తి పామ్ ట్రీ..అదేనండీ తాటిచెట్టుపైకి ఎక్కి కొసారు కొమ్మను నరికాడు. ఆ సమయంలో ఆ తాటి చెట్టు స్ర్పింగ్ మాదిరి ఇచ్చిన రియాక్షన్ చూస్తే పైని ఉన్నవారికి ఏమో గానీ.. కింద ఉండి చూసిన వారికి మాత్రం గుండె అదిరిపోవడం ఖాయం.
ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి అసలు భయమనేదే తెలియదేమో. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నా లెక్క చేయకుండా 100 అడుగుల పైకి ఎక్కి తాటి చెట్టును నరికివేసేందుకు ప్రయత్నించాడు. అది బాగా పైకి ఉంది. అందులోనూ కొసవరకు వెళ్లడం అంటే.. చావుతో చెలగాటమే. కానీ ఇతను మాత్రం ఏ మాత్రం భయపడలేదు. కాకపోతే పైకి పోయే కొద్దీ.. తాటిచెట్టు కాస్త వంగుతూ పోయింది. అయినా బెదరలేదు.. వెంట తీసుకెళ్లిన కటింగ్ మిషన్‌తో తాను కూర్చున్న పై మండను నరికివేశాడు. పై ఆకులతో ఉండే మండను కొట్టేయడంతో.. ఆ పీస్ కింద పడగా.. ఇతను కొనకు కూర్చుని ఉండడంతో.. అది అటూ ఇటూ స్ప్రింగ్ మాదిరిగా ఊగింది. అప్పుడు చూడాలి.. పైన కూర్చున్నోడికి ఎలా ఉందో కానీ… చూసినోడికి మాత్రం షాక్‌కు గురైనంత పనైంది. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.