Cow in Car Viral Video : మీనీ వ్యానులో కిక్కిరిసిన జనంతో పాటు ఆవు ప్రయాణం.. వైరల్‌ అవుతోన్న వీడియో

|

Mar 02, 2021 | 11:15 AM

ప్రపంచంలో ఎక్కడైనా పల్లెటూర్లు ఒక్కటే అనిపిస్తాయి కొన్ని కొన్ని సంఘటన చూస్తుంటే.. ముఖ్యంగా గ్రామాల్లో ప్రయాణాలు చేసే సమయంలో వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తుంటారు.. అది మనదేశంలోనే కాదు ఎక్కడైనా..

Cow in Car Viral Video : మీనీ వ్యానులో కిక్కిరిసిన జనంతో పాటు ఆవు ప్రయాణం.. వైరల్‌ అవుతోన్న వీడియో
Follow us on

viral-video : ప్రపంచంలో ఎక్కడైనా పల్లెటూర్లు ఒక్కటే అనిపిస్తాయి కొన్ని కొన్ని సంఘటన చూస్తుంటే.. ముఖ్యంగా గ్రామాల్లో ప్రయాణాలు చేసే సమయంలో వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తుంటారు.. అది మనదేశంలోనే కాదు ఎక్కడైనా సహజమే కూడా అయితే అలా ఓ మినీ వ్యాన్ లో మనుషులతో పాటు ఆవు కూడా ప్రయాణించింది. తాజాగా ఓ మినీ వ్యానులో ఆవు ప్రయాణిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ఇంటి సామాన్లతో పాటు ఆవును కూడా మినీ వ్యానులో తరలించాడు. కాగా అదే రూట్‌లో మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మొబైల్‌లో వీడియో తీసి.. నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియోను ఐఏఎస్‌ ఆఫీసర్ అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ఇప్పటి వరకు అత్యంత ఘనమైన జుగాడ్‌‌ ఇదేనని క్యాప్షన్‌ పెట్టారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింది అన్న వివరాలు మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్‌ పెడుతున్నారు. గ్రామాల్లో ఆవును ఈ విధంగా తరలించడం ఎప్పుడూ చూడలేదని ఓ యూజర్‌ కామెంట్‌ చేస్తే.. ఆ వాహనానికి ఇది పెద్ద పరీక్ష అని మరొకరు వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని ఆటోల్లో జనం పట్టకుండా ప్రయాణిస్తుంటారు..కానీ జనంతోపాటు ఆవు కూడా ఇలా కిక్కిరిసి ప్రయాణించాల్సి వచ్చిందని మరొక నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టారు. మీరు కూడా ఆవు ప్రయాణం పై ఓ లుక్ వేయండి మరి

ఐఏఎస్‌ ఆఫీసర్ అవనీష్ శరణ్ ట్విట్టర్ వీడియో

Also Read:

Karthika Deepam Today : అత్తగారితో నమ్మకం మీదనే నమ్మకం పోయిందంటున్న వంటకలక్క

 యూపీలోని హత్రాస్ లో మళ్ళీ సేమ్ క్రైమ్, అత్యాచార బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన దుండగులు